Nojoto: Largest Storytelling Platform

ఆ మాత్రం జాగ్రత్త పాటించననా? మరీ అంత సంశయమేంటి నీక

ఆ మాత్రం జాగ్రత్త పాటించననా?
మరీ అంత సంశయమేంటి నీకు!
ఎక్కడ మూడోకంట పడతానోనని
భయంతో కూడిన ఆత్రంతో 
ఓ పరిగెత్తుకొచ్చావేం వరుణుడా! 
నా కన్నీటిని నీ చినుకుల్లో కలుపుకొన.
నాకన్న నీకే ఎందుకంత తొందర
నీకోసం నే ఎదురుచూడాలే గాని 
నాకోసం నువు పరుగున రావడం నాకెందుకో 
ఆత్మీయ ఆలింగనమనిపించింది
నీ అరుపులు నాకేదో జాగ్రత్త చెబుతున్నట్టు 
నీ స్పర్శ నా వెన్ను తడుతున్నట్టుంది
నువ్వైనా నాకోసం కరిగి కదిలొచ్చావ్
ఐనా సంతోషంగా ఉంది 
మనస్ఫూర్తిగా ఏడ్చే అవకాశం 
నువ్వే ఇవ్వగలవ్ మరి. #కన్నీరు #వర్షం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion
ఆ మాత్రం జాగ్రత్త పాటించననా?
మరీ అంత సంశయమేంటి నీకు!
ఎక్కడ మూడోకంట పడతానోనని
భయంతో కూడిన ఆత్రంతో 
ఓ పరిగెత్తుకొచ్చావేం వరుణుడా! 
నా కన్నీటిని నీ చినుకుల్లో కలుపుకొన.
నాకన్న నీకే ఎందుకంత తొందర
నీకోసం నే ఎదురుచూడాలే గాని 
నాకోసం నువు పరుగున రావడం నాకెందుకో 
ఆత్మీయ ఆలింగనమనిపించింది
నీ అరుపులు నాకేదో జాగ్రత్త చెబుతున్నట్టు 
నీ స్పర్శ నా వెన్ను తడుతున్నట్టుంది
నువ్వైనా నాకోసం కరిగి కదిలొచ్చావ్
ఐనా సంతోషంగా ఉంది 
మనస్ఫూర్తిగా ఏడ్చే అవకాశం 
నువ్వే ఇవ్వగలవ్ మరి. #కన్నీరు #వర్షం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion