Nojoto: Largest Storytelling Platform

ఈడొచ్చిన చినదానికి మొగుని రాక ఓదార్పు ప్రేమించిన క

ఈడొచ్చిన చినదానికి మొగుని రాక ఓదార్పు
ప్రేమించిన కుర్రాడికి చెలియ రాక ఓదార్పు

నీటి చెమ్మ జాడ లేక వసుధ గుండె పగిలిందీ
బీడుబడిన నేలమ్మకు వాన రాక ఓదార్పు

వేడుకలను కాంక్షించీ వేదనలను ఓర్చిందీ
గాయపడిన వేణువుకూ కృష్ణ రాక ఓదార్పు

కళ తప్పిన మాను మేను కూల్చేందుకు గాలి గోల
శిశిరమంచు వనసీమకు చిగురు రాక ఓదార్పు

మూడు దశల జీవితాన శోకమెంతొ వన్నెలయ్య
బాధలలో మోము పైన నవ్వు రాక ఓదార్పు #వన్నెలయ్య_గజల్ 71
#గజల్ #గజల్స్ #ఓఓదార్పు #ఓదార్పు #gazallover #gazal
ఈడొచ్చిన చినదానికి మొగుని రాక ఓదార్పు
ప్రేమించిన కుర్రాడికి చెలియ రాక ఓదార్పు

నీటి చెమ్మ జాడ లేక వసుధ గుండె పగిలిందీ
బీడుబడిన నేలమ్మకు వాన రాక ఓదార్పు

వేడుకలను కాంక్షించీ వేదనలను ఓర్చిందీ
గాయపడిన వేణువుకూ కృష్ణ రాక ఓదార్పు

కళ తప్పిన మాను మేను కూల్చేందుకు గాలి గోల
శిశిరమంచు వనసీమకు చిగురు రాక ఓదార్పు

మూడు దశల జీవితాన శోకమెంతొ వన్నెలయ్య
బాధలలో మోము పైన నవ్వు రాక ఓదార్పు #వన్నెలయ్య_గజల్ 71
#గజల్ #గజల్స్ #ఓఓదార్పు #ఓదార్పు #gazallover #gazal

#వన్నెలయ్య_గజల్ 71 #గజల్ #గజల్స్ #ఓఓదార్పు #ఓదార్పు #gazallover #gazal