Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_అకృత Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_అకృత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 30 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_అకృత #అకృత #వన్నెలయ్య_రుబాయిలు

read more
బంగరు కౌగిలి కొందరిది
కవితల నిచ్చెలి కొందరిది
పోగేసినవే లక్షణాలు మరి..
పూవుల దోసిలి కొందరిది

బంగరు కౌగిలి అందరిది
పూవుల దోసిలి కొందరిది
పోగేసినవే లక్షణాలు మరి..
కవితల నిచ్చెలి ఎందరిది #వన్నెలయ్య_అకృత #అకృత #వన్నెలయ్య_రుబాయిలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_అకృత

read more
వేకువ తేజం నీవే వెన్నల వదనం
వేదన శూన్యం నీవే వెన్నెల సదనం

మృదు లయ తాళం నీలో మురళీ రాగం
చిన్మయ గీతం నీలో చింతిత యోగం

బంధన లయితం నీదే బృందపు వేషం
అంగన చరితం నీదే ఆత్మల తోషం

మరువని ధ్యానం నాలో మాదవ స్మరణం
కృష్ణుని జ్ఞానం నాలో కదిలే తరణం #వన్నెలయ్య_అకృత

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_అకృత #వన్నెలయ్య_మొగ్గలు

read more
ఇల్లంతా తన సందడితో,
వెలుగు స్నానమాడినట్లు..
ఆ రూపం వేయి వెన్నెలల అతిశయం #వన్నెలయ్య_అకృత  #వన్నెలయ్య_మొగ్గలు

Naresh Reddy Aleti

పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నీ🌹 #వన్నెలయ్య_అకృత

read more
గులాబీల తోటలోన
తిరిగివచ్చె నా ముందుకు
రోజాలకు ఎరుపు లేదు
తన బుగ్గకు అంటింది పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నీ🌹
#వన్నెలయ్య_అకృత

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_అకృత

read more
వెన్నపూస పనికిరాదు
మల్లెపూవు పనికిరాదు
మా పాపల వెలుగుల్లో..
చందమామ పనికిరాదు #వన్నెలయ్య_అకృత

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 232 #గజల్ #వన్నెలయ్య_అకృత #వన్నెలయ్య_భవిష్య #వన్నెలయ్య_భక్తి_గజల్

read more
బాధకు నిలిచిన స్నేహం గొప్పది.!
బోధను పలికిన గానం గొప్పది.!

రణమున వనమున ఆపద క్షణమున
తోడై నిలిచిన బంధం గప్పది.!

చెదరని ప్రేమా విరహము రాధా
నిరతం తలచిన ధ్యానం గొప్పది.!

వేణువు నిండా వేదన కాదా?
గాయం పలికిన రాగం గొప్పది.!

వన్నెల వెన్నెల'లక్కా చెల్లీ
నిశి'లో వెలిగిన అందం గొప్పది.! #వన్నెలయ్య_గజల్ 232 #గజల్ #వన్నెలయ్య_అకృత #వన్నెలయ్య_భవిష్య #వన్నెలయ్య_భక్తి_గజల్

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 231 #గజల్ #వన్నెలయ్య_భవిష్య #వన్నెలయ్య_అకృత

read more
మతముల మధ్యా సమతలు మధురం.!
ఎగిరే జెండా మడతలు మధురం.!

వీడుక నోర్వవు కలిసిన యదలు
అక్కా చెల్లెలి మమతలు మధురం

బాధకు చెమరని నయనం ఉందా?
హితరుల కొరకై కలతలు మధురం.!

మాసిన గాథలు ఎన్నో తెలుసా?
హృదయం మరువని చరితలు మధురం.!

వన్నెల గజళ్ళు పాడగ రాదా?
లయకై వాడే కొలతలు మధురం.! #వన్నెలయ్య_గజల్ 231 #గజల్ 
#వన్నెలయ్య_భవిష్య #వన్నెలయ్య_అకృత

Naresh Reddy Aleti

మా అకృత నోట మరో కూనలమ్మ #అకృత_కూనలమ్మపదాలు #కూనలమ్మపదాలు #కూనలమ్మ #వన్నెలయ్య_అకృత

read more
పువ్వు మొగ్గ ఒకటి
నవ్వు బుగ్గ ఒకటి
ముగ్గు బుట్ట ఒకటి
ఓ కూనలమ్మ మా అకృత నోట మరో కూనలమ్మ
#అకృత_కూనలమ్మపదాలు #కూనలమ్మపదాలు #కూనలమ్మ #వన్నెలయ్య_అకృత

Naresh Reddy Aleti

నేను కూనలమ్మ పదాలు పాడుతుంటే నా కూతురు(7) కూడా నేనొక కవిత చెప్పాల్లా అంటు వచ్చింది.. చెప్పమనగానె ఆశువుగా ఇలా చెప్పేసింది.. భావమెలా ఉన్న తన ప్రయత్నం నాకు నచ్చింది.! #అకృత_కూనలమ్మపదాలు #వన్నెలయ్య_అకృత

read more
నక్షత్రం ఒకవైపు
సుర్యుడూ ఒకవైపు
చంద్రుడు మరోవైపు
ఓ కూనలమ్మ.! నేను కూనలమ్మ పదాలు పాడుతుంటే నా కూతురు(7) కూడా నేనొక కవిత చెప్పాల్లా అంటు వచ్చింది.. 
చెప్పమనగానె ఆశువుగా ఇలా చెప్పేసింది..
భావమెలా ఉన్న తన ప్రయత్నం నాకు నచ్చింది.!
#అకృత_కూనలమ్మపదాలు #వన్నెలయ్య_అకృత

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #వన్నెలయ్య_అకృత #వన్నెలయ్య_ఆర్షన్_శ్రీకృష్ణ #కృష్ణార్పణం ఇతి గుహ్య తమం శాస్త్రం రణ క్షేత్రం లో చాలా రహస్యమైంది అంటాడు రేపల్లెలో విరివిగా పంచాడు.. ఏమిటో ఈ అల్లరి వాడి లీలలు

read more
ఆల మందలు కాచినావు
పాలు పెరుగులు పంచినావు
కడుపు నింపే చర్యలల్లో..
మోక్ష సుధలను దాచినావు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #వన్నెలయ్య_అకృత #వన్నెలయ్య_ఆర్షన్_శ్రీకృష్ణ #కృష్ణార్పణం
ఇతి గుహ్య తమం శాస్త్రం
రణ క్షేత్రం లో చాలా రహస్యమైంది అంటాడు
రేపల్లెలో విరివిగా పంచాడు.. ఏమిటో ఈ అల్లరి వాడి లీలలు
loader
Home
Explore
Events
Notification
Profile