Nojoto: Largest Storytelling Platform

*పంతం ఓ మొండి గుణం;పంతం మనిషిని పశువుగా మారుస్తుంద

*పంతం ఓ మొండి గుణం;పంతం మనిషిని పశువుగా మారుస్తుంది.ఇంగితం కోల్పోయేలా చేస్తుంది.పంతకారుడు ఎవరి మంచి మాటలూ వినడు.పంతకాడు పందేలకు సిద్ధమవుతాడు.
తన-మన బేధం మరచిపోతాడు. పంతంతో ఊగిపోయేవారికి ప్రేమ,దయ,కరుణ, సానుభూతి- ఇట్లాంటి ఏవి రుచించవు.పంతం ఓ పూనకం లాంటిది;పంతం ఆవహిస్తే పరిస్థితులు అర్థంకావు. పరువు ప్రతిష్టలు పోయినా పంతం గెలవాలని బంగారు లాంటి జీవితాన్ని అశాంతి మయం చేసుకుంటారు. పంతానికి ఆజ్యం అహంకారం.పంతం వల్ల జీవితం చితికి పోతుంది పంతం చిరాకు,చింతలను రగిలిస్తుంది.పంతంతో పని చేయకూడదు.పంతంతో కూర్చుంటే ఏపని సానుకూలంగా కూడా కాదు.*

©VADRA KRISHNA
  #seashore పంతం
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon6

#seashore పంతం #ఆలోచనలు

99 Views