Nojoto: Largest Storytelling Platform

Best సమస్యాపూరణ64 Shayari, Status, Quotes, Stories

Find the Best సమస్యాపూరణ64 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 8 Stories

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత #భావ సుమాలు #వైక్యూ కవి

read more
తలంబ్రాలా అవి తలమునకలుగా
నీ ప్రేమ లో ముంచు అభిషేకాలు 
భూమి ఆశీర్వాదము వున్న  అక్షతల్లా
మంత్ర పూర్వకముగా నన్ను 
మంత్రముగ్ధులను చేసిన ఆణిముత్యాలు 
ఇంత కన్నా మంచి స్వాగతం వుంటుందా 
ఇంత గొప్ప సాంప్రదాయానికి నమో నమః🙏 #సమస్యాపూరణ64 
#పెళ్ళివిశిష్టత 
#భావ సుమాలు
 #వైక్యూ కవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ64 #పెళ్లివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
గృహస్థాశ్రమంలో అడుగుపెట్టడానికి 
తోడునీడగా భార్యభర్తలు గడపడానికి
జీవితాంతం ఒకరికొకరుగా వుండడానికి
పెళ్లి ప్రతిఒక్కరికీ అత్యంత విశిష్టమైనది #సమస్యాపూరణ64 
#పెళ్లివిశిష్టత
#భావసుమాలు
#వైక్యూకవి

Naresh Reddy Aleti

#వివాహంఒక్కవాక్యంలో #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత #Marriage #కళ్యాణం #వివాహం #Telugu #telugukavi

read more
ఉత్తర దక్షిణ ధృవాల సుందర కలయిక! #వివాహంఒక్కవాక్యంలో 
#సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత 
#marriage #కళ్యాణం 
#వివాహం #telugu #telugukavi

Naresh Reddy Aleti

1)గర్భదానం 2)పుంసావనం 3)సీమంతం 4)జాతకర్మ 5)నామకరణం 6)నిష్క్రమణ 7)అన్నప్రాసన 8)చూడాకరణ #వివాహం #సంస్కారం #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత #వివాహసంస్కారం

read more
బురదలో పడిన వస్తువును శుభ్రం చేసి స్వీకరిస్తాం.
బంగారానికి వన్నె చేకూర్చేందుకు అగ్నిలో పుటం వేస్తం.
దీన్నే పారిభాషిక పదంలో "సంస్కారం" అంటాం.
మానవుని జీవితకాలంలో కొన్ని ముఖ్యమైన దశలలో 16 సంస్కారాలను ఆర్ష సంస్కృతి ప్రవేశపెట్టింది. అందులో మూడు సంస్కారాలు జీవి పుట్టక మునుపే మోదలవుతాయి.
1)గర్భాదానం 2)పుంసావనం 3)సీమంతం..
ఇవి అన్నీ కూడా వాస్తవానికి జీవిని సరి చేసేవి.
ఆ వరసలో జీవి పుట్టాక మొదటిది 4)జాతకర్మ.
చివరి సంస్కారమైన 16)అంత్యేష్టికి ముందుది 15) వివాహం.
మనం వివాహాన్ని గొప్పగా జరుపుకుంటాం. మిగతవి జరుపుకోం.. కొందరు కొన్ని చేస్తారు.
ఏం చేద్దాం అన్నింటికీ కాలం చెల్లింది. అవగాహన లోపించింది.
శుద్ది చేయని పాత్రలో పాలు పోస్తే పగిలిపోతాయి.
ప్రతి జీవీ పొందాల్సింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కోరికలతో అశుభ్రమైన బుద్ది నిలుపుకోలేదు. బుద్ధి ని శుద్ది చేయాలి. శుద్ది చేసే ప్రక్రియే వివాహ సంస్కారం. పరమపద సోపానం అధిరోహించే క్రమంలో వివాహం నిచ్చెన.
ఇదే సనాతన ధర్మం. ఆర్ష సంస్కృతి వైభవం.
"స్వస్తి నో బృహస్పతిర్దధాతు" 1)గర్భదానం
2)పుంసావనం
3)సీమంతం
4)జాతకర్మ
5)నామకరణం
6)నిష్క్రమణ
7)అన్నప్రాసన
8)చూడాకరణ

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత Credit goes to sanathana dharma

read more
కష్టంలో సుఖంలో
ధర్మంలో అర్థంలో
కామంలో మోక్షంలో
మనసులో జీవితంలో
ఒకరినొకరు విడిచి చరించబోము
అని చేసే ప్రమాణం పెళ్ళి...
"నాతి చరామి" #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత 
Credit goes to sanathana dharma

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_వైక్యూ_కవి #వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత రామకృష్ణాది అవతారాలు ఏవి రాక మునుపు యజ్ఞ యాగ యోగములే ప్రధానముగా ఉన్న సత్యకాలంలో మన మహర్షులు తల్లిదండ్రులు చేసిన సంతానోత్పత్తిని క్రియను ధ్యానం చేసి సత్యాన్ని పొందారు.. ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు కలవడమనేది ఎంత పవిత్రమైనదో..

read more
పెళ్ళంటే?

ఉప్పోంగే వయసుకు ఊరటేమో
చెలరేగే తపనలకు బాసటేమో!
అద్వైత మయ్యేటి రాగమేమో
సృష్టి చక్రాన్ని తిప్పేటి యోగమేమో!
మనములోని మోహానికి లాభమేమో
కణములోని ప్రాణికి శుభమేమో!

అథాధిప్రజమ్|
మాతా పూర్వ రూపం| పితోత్తర రూపమ్|
ప్రజా సంధిః| ప్రజననగ్ం సంధానమ్| #వన్నెలయ్య_వైక్యూ_కవి #వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత 
రామకృష్ణాది అవతారాలు ఏవి రాక మునుపు యజ్ఞ యాగ యోగములే ప్రధానముగా ఉన్న సత్యకాలంలో మన మహర్షులు తల్లిదండ్రులు చేసిన సంతానోత్పత్తిని క్రియను ధ్యానం చేసి సత్యాన్ని పొందారు..
ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు కలవడమనేది ఎంత పవిత్రమైనదో..

Naresh Reddy Aleti

నేను ఇది 15సం క్రితం ఒక గురువు గారు చెబుతుంటే విన్నాను.. కొంచెం ఏమైన మార్పు జరిగిందేమో నేను చెప్పడంలో.. ఇది చెప్తు గురువుగారు చాల నవ్వించారు. మరియు స్వామి రామతీర్థ చాల గొప్పవ్యక్తి 1873-1906. స్వామి వివేకానంద 1863-1902, తో సమానం.. ఇద్ధరూ విదేశాలలో సనాతన సంస్కృతి ని చాటినవారే. సమకాలినులు. మరియు ఇద్దరూ చిన్నవయసులోనే పరమపదించారు. ఇద్దరూ మృత్యువుకు బయపడనివారే. పెళ్లి గురించి కొంచం సరదాగా ఉంటదని ఇది పోస్టు చేస్తున్న. అన్యదా భావించకండి. #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత

read more
అదీ గంగానదీతీరం
స్వామి రామతీర్థ శిష్యులకు సందేహ నివృత్తి చేస్తున్న సమయం..
ఓ శిష్యుడు అడిగాడు
కళ్లు ఉన్న గాంచలేని సత్యమేమిటని?
గురువు సమయస్పూర్థితో చమత్కరంగా...
అప్పుడే పక్కనే నదిపై వంతెన దాటుతున్న  ఊరేగింపులో ఉన్న నూతన వధూవరులను చూపుతూ ఆ జంటే నాయన అన్నాడు.
అదెలా అంటూ మళ్లీ ప్రశ్నించాడు శిష్యుడు.
వాల్లు కూర్చున్న రథం ముందర చూడరా..!
తబల వాయిస్తున్నాడొకడు.
తాళాలు చరుస్తున్నాడింకొకడు.
సన్నాయి ఊదుతున్నాడు మరొకడు.
అయితే ఏంటి? తెలుసుకోవాలనే ఆత్రుతతో శిష్యుడు.
అగు నాయనా విను.. కొనసాగించాడు గురువు
డోలక్: తగుల్కో తగుల్కో అంటుంటే (శిష్యులు నవ్వులు)
తాళాలు: తగుల్కున్నావో.. ఒకరినొకరు చరుచుకోవడమే ఇక. (శిష్యులు నవ్వులు)
సన్నాయి: ఆతరువాత జీవితమంతా పి..పి...పీ ఏడుపే. (శిష్యులు నవ్వులు)

అంత చక్కగా చెబుతుంటే అర్థం చేసుకోకుండా సారహీన సంసారంలోకి వెలుతున్నారే
అదే నాయనా గుడ్డితనం అని ముగించాడు స్వామి రామతీర్థ.
"సంసార స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకుల" నేను ఇది 15సం క్రితం ఒక గురువు గారు చెబుతుంటే విన్నాను.. కొంచెం ఏమైన మార్పు జరిగిందేమో నేను చెప్పడంలో.. ఇది చెప్తు గురువుగారు చాల నవ్వించారు.
మరియు స్వామి రామతీర్థ చాల గొప్పవ్యక్తి 1873-1906.
స్వామి వివేకానంద 1863-1902, తో సమానం.. ఇద్ధరూ విదేశాలలో సనాతన సంస్కృతి ని చాటినవారే. సమకాలినులు. మరియు ఇద్దరూ చిన్నవయసులోనే పరమపదించారు.
ఇద్దరూ మృత్యువుకు బయపడనివారే.

పెళ్లి గురించి కొంచం సరదాగా ఉంటదని ఇది పోస్టు చేస్తున్న. అన్యదా భావించకండి.
#సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత

Naresh Reddy Aleti

Credit goes to my friend. 10 yrs క్రితం ఒక మిత్రుడు చెప్పిన మాటలివి. #సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత

read more
పెళ్లి అనేది ఒకే ద్వారమున్న గది లాంటిది..
పోవడమే గాని రావడం మన చేతిలో ఉండదు.
బయట ఉన్నవారికి పోవాలి పోవాలి అనే ఆరాటం.
లోపలున్న వారికి బయట పడాలి పడాలి అనే పోరాటం. Credit goes to my friend.
10 yrs క్రితం ఒక మిత్రుడు చెప్పిన మాటలివి.
#సమస్యాపూరణ64 #పెళ్ళివిశిష్టత


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile