Nojoto: Largest Storytelling Platform

Best ఊహ Shayari, Status, Quotes, Stories

Find the Best ఊహ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°Šà°¹ in english, ఊహలు గుసగుసలాడే lyrics, ఊహకు అందని ప్రేమ, ఊహకు అందని ప్రేమ లిరిక్స్, à°Šà°¹ సినిమా,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

అంతులేనివి ఊహలు. మరి ఆ ఊహలకు పదాల రెక్కలు తొడగడం మీ వంతు! #ఊహ #Collab #yqkavi #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఊహ నా వాస్తవిక ప్రపంచం
కాల్పనిక ప్రపంచం‌ నా వాస్తవికం

ఊహ కాల్పనికానికి గడువు పెంచుతునే 
వాస్తవికత నిడివి తగ్గిస్తుంది 

మరుజన్మిస్తున్నాని నమ్మిస్తూనే 
హడావిడి లేకుండా హరింపజేసేది 

ఊహ ఖర్చు లేని పనియని కీర్తించబడుతుంది
గాని కాలాన్ని చాలా ఖరీదుగా ఖర్చుపెట్టిస్తుంది

వాస్తవంలో చస్తూ బ్రతుకుతున్న ఎందరినో బ్రతికిస్తుంది 
తన పల్లకిలో ఊరేగించి పాక్షిక సంతసాన్ని బహుకరిస్తుంది

ఊహ ఉషాకిరణమై ఊపిరి పోయగలదు ఊర్మియై ఉప్పెన రేపి 
ఉసూరుమనిపించగలదు 
ఊహ చేయలేనిదంటు ఏమి లేదు ఊహలో
 అంతులేనివి ఊహలు. మరి ఆ ఊహలకు పదాల రెక్కలు తొడగడం మీ వంతు! #ఊహ #collab #yqkavi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

srilatha lion

నీ రాకకు మునుపు ఊహ ఎపుడు ఆర్తినే చవిచూసేది
నీ రాకతో నవ్వడం నేర్చుకుంది చిందులేసింది తనకే అంచనాకు మించని చిత్రవిచిత్రాలనే విందులా ఆరగించేసింది
నీ పోకడ తర్వాత తిరిగి అదే మునుపటి ఆప్తమిత్ర ఆర్తినే అలుముకుంది...
ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చామంటే ఇదేనేమో..  #ఆర్తి #ఊహ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion

srilatha lion

ఊహ...చాలా అ౦దమైనది కావచ్చు.. భారమైనది కావచ్చు..
ఎ౦త అ౦దమైనదో అ౦తే తేలిక రూపంలో ఉన్న భారమైన భావనే ఊహ
ప్రతి అమ్మాయి మనసు అ౦దమైన ఊహల పల్లకిని మోస్తు౦ది
ఆ పల్లకిలో ఊహలన్నిటికి అద్ద౦ పట్టాల౦టే జీవితకాలం చాలదనిపిస్తు౦ది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా అభివృద్ధితో దూసుకుపోతు౦డొచ్చు. అద౦తా బాహ్య౦గా కాని మనసుకొచ్చేసరికి చాలా చిన్ని ప్రపంచం అమ్మాయిలది.
ఎన్నో ఆశలతో ఊహాప్రయాణ౦లో విహరిస్తారు.
  అమ్మాయిలనే కాదు ప్రతి ఒక్కరు ఊహాప్రయణ౦లో ప్రయాణికులే ఎలాగ౦టారా?నిత్యం మన౦ ఏదైనా చేయబోతు౦టే ఒకసారి దాన్ని ఊహి౦చుకు౦టా౦ ఇలా చేద్దామా అలానా అని
ఒకరికి ప్రియవేదనమైన ఊహ ఇ౦కొకరికి వేడుకల ఊహ 
ఒకరికి భాధ్యతలతో కూడిన ఊహ ఇ౦కొకరికి తెగిన గాలిపట౦లా స౦చరి౦చే పిచ్చి ఊహ 
ఇలా ఈ ఊహాప్రయాణ౦లో మన అమ్మ,నాన్న,స్నేహితులు, బ౦ధువులు,అపరిచితులు ఇలా ఎవరి జీవిత౦లో వారు వారి జీవితాలకనుగుణ౦గా ప్రయాణిస్తూనే ఉ౦టారు
ఊహలకి మాటలొస్తే నా ప్రియసఖుడికి చెరవేయవా నా మనోభావపు వా౦ఛలు..ఊహలకే మాటలొస్తే నాతో ప౦చుకోవా నా ఊహల తాలూకా తన అనుభవాలు..ఊహలకే మాటలొస్తే నాకు తెలియజెప్పవా తనలోని మ౦చిచెడులు
ఊహలకే మాటలొస్తే నాతో క్షణక్షణ౦ కాలక్షేపం చేయవా.
అనుక్షణం నీకు నేనున్నాన౦టూ నా వెన్ను తట్టవా?
   మనిషికి ఊపిరి ఎలా౦టిదో ఊహ అలా౦టిదే మన౦ ఊహి౦పులో మ౦చి,చెడులు౦డొచ్చు కాని ఊహే వలద౦టే ఎలా? ఊహాప్రప౦చపు మాయాప్రయాణ౦లో స్వేఛ్ఛగా విహరి౦చ౦డి నిజజీవితాన్ని అనుభవి౦చ౦డి. #yqbaba #yqkavi #ఊహ 
#srilathalion #teugu #teluguvelugu #lovequotesbysrilathalion

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #వన్నెలయ్య_ప్రేమ #రెక్కలు #ప్రేమకవిత #ప్రహేళిక #ప్రేమ #ఊహ

read more


ఊపుతుంది ఊయల
మనసును..
తేల్చుతుంది గాలిలో
వయసును..

ప్రేమ!
ఊహ! #వన్నెలయ్య_రెక్కలు #వన్నెలయ్య_ప్రేమ #రెక్కలు #ప్రేమకవిత #ప్రహేళిక #ప్రేమ #ఊహ

Suryasamudra Sasura

#ఊహ యొక్క #రెక్కలపై #కలలు #ఎగరడం ఎంత #వేగంగా ఉంది #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile