ఎంత బాగుండేదో... అప్పుడు నీవు... నేను... మనిద్దరమే! మనదే ఓ ప్రపంచం. మన చిన్ని ప్రపంచంలో మనిద్దరి ప్రేమే మనకు తోడు నీడగా మనల్ని కంటికి రెప్పల్లా కాచుకొనేది...!! ఏమీ బాగాలేదు... ఇప్పుడు నీవెక్కడో!?... నేనెక్కడో!? ఒకళ్ళకొకళ్ళం ఏమీ కాని పరాయివాళ్ళం మనిద్దరం. నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు... నీ తప్పో!? నా తప్పో!? బలైపోయాం ఇద్దరం. ఇక జీవితమంతా ఇంతేనేమో!? ఎప్పటికీ కలవని సమాంతర రేఖలమే ఏమో!? #తెలుగుకవితలు #తెలుగురచనలు #yqtelugu #yqtelugukavi #telugu #telugukavi #telugulovequotes #teluguwritings