Nojoto: Largest Storytelling Platform

Best గీతాదినోత్సవం Shayari, Status, Quotes, Stories

Find the Best గీతాదినోత్సవం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 182 #గజల్ #తెలుగుగజల్ #గీతాసారం #గీతాదినోత్సవం #Geetha #gazal #వన్నెలయ్య_భక్తి_గజల్

read more
అజ్ఞానం తుడిచేసె ప్రవాహమే గీతంటే
సుజ్ఞానం పంచేసే ప్రసాదమే గీతంటే

రణములోని వెనుకడుగుకు చైతన్యం రగిలించెను
సాగడమే మునుముందుకు ప్రయాణమే గీతంటే

చిగురులను చింతలను దాచిందే బ్రతుకు వనము
ఫలమునందు చెదిరిపోకు ప్రయత్నమే గీతంటే

తానెవరో మరిచిపోతె అడవి రాజు మేక క(థ)దా
నీ శక్తిని యెరుక చేయు ప్రబోధమే గీతంటే

సత్యమేదొ కనుగొనగా తపించాలి ఓ యువకా
వన్నెలయ్య కన్నుల్లో ప్రయోగమే గీతంటే #వన్నెలయ్య_గజల్ 182 #గజల్ #తెలుగుగజల్ #గీతాసారం #గీతాదినోత్సవం #Geetha #gazal #వన్నెలయ్య_భక్తి_గజల్

Naresh Reddy Aleti

అధికారం కోసం , ఓట్ బ్యాంక్ కోసం మత రాజకీయాలు చేస్తూ మతాలకు చెడ్డపేరు తెస్తూ.. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెడుతున్న ఏ ఒక్కరు క్షమార్హులు కాదు. నావరకు మతం అనేది ఆలోచన. ఆవేశం కాదు. ఎన్నో కష్టాలు పడి పారిపోయి వచ్చిన కాందిశీయులకు ఆశ్రయం ఇచ్చింది ఈ పవిత్ర భారతదేశం రోమ్ నిరంకుశత్వానికి తమ పవిత్ర దేవాలయం కూలిపోతే శరణార్ధులై దక్షిణ భారతదేశంలో అడుగెట్టిన ఇజ్రాయెల్ ప్రజలను ఆదుకుని అండగా నిలిచినది ఈ పుణ్య భారతావని. #వన్నెలయ్య_కూనలమ్మ #గీత #గీతాసారం #మనదేశగొప్పతనం #గీతామృతజ్ఞానం #గీతాదినోత్సవం

read more

కాంతి చూపిన మతము
భ్రాంతి బాపిన గతము
శాంతి గీతా పథము
ఓ కూనలమ్మ..! అధికారం కోసం , ఓట్ బ్యాంక్ కోసం మత రాజకీయాలు చేస్తూ మతాలకు చెడ్డపేరు తెస్తూ..
మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెడుతున్న ఏ ఒక్కరు క్షమార్హులు కాదు.

నావరకు మతం అనేది ఆలోచన. ఆవేశం కాదు.

ఎన్నో కష్టాలు పడి పారిపోయి వచ్చిన కాందిశీయులకు ఆశ్రయం ఇచ్చింది ఈ పవిత్ర భారతదేశం

రోమ్ నిరంకుశత్వానికి తమ పవిత్ర దేవాలయం కూలిపోతే శరణార్ధులై దక్షిణ భారతదేశంలో అడుగెట్టిన ఇజ్రాయెల్ ప్రజలను ఆదుకుని అండగా నిలిచినది ఈ పుణ్య భారతావని.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile