Nojoto: Largest Storytelling Platform

Best qkpoetry Shayari, Status, Quotes, Stories

Find the Best qkpoetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 48 Stories

Narahari Rao

Kiss is the key of Love. 

Love is the lock of Life. 

You are my Love. 

You are my Life.  #qkbaba #qkdidi #qkpoetry #qklove #qklife

Narahari Rao

The night is trying to dominate me with its complete darkness 
and also making efforts to scare me enough 
in its own way as usual... 
But I'm not, as I am grown up one now. 

But the night is not aware of my 
inside thoughts
that I will be happy in whatever the situation is... 
making myself comfort with the surroundings.

Actually to say I am  very positive way thinker 
and now I am very pleased to see the 
far most star...
thanking it for that it is there and leading my way. 
 #qkbaba #qkdidi #qklife #qkpoetry #qkkthoughts

Narahari Rao

నీ సన్నిధి చాలు కృష్ణా 

వేరే పెన్నిధి ఎందుకు నాకు!? 

నీ సాన్నిహిత్యం చాలు శ్యామా
 
వేరే సాంగత్యం ఎందుకు నాకు!? 

నీ వేణునాదం ఒక్కటి చాలు కాన్హా 
 
వేరే సంగీతనాదం ఎందుకు నాకు!?  #qklove #qkpoetry #qkkthoughts

Narahari Rao

చిక్కని చిమ్మచీకటికే కాదు

ఆకసాన కరిమబ్బుకు సైతం 

చెమటలు పడుతున్నాయి...

నా చెలి కురుల నలుపుదనం చూసి!  #qklove #qkpoetry #qkbaba #qkkthoughts

Narahari Rao

మల్లెల తెల్లదనం
 
వెన్నెల కమ్మదనం 

వెలవెలబోతున్నవి... 

నా చెలి దరహాసపు 
వెలుగుల ముందు! 

 #qklove #qkpoetry #qklife #qkkthoughts

Narahari Rao

చందురుని వెన్నెలలు 

తారకల తళతళలు

తెలతెలబోతున్నవి... 

నా చెలి కనుల కాంతుల ముందు!  #qklove #qkpoetry #qkbaba

Narahari Rao

🚶‍♂🚶‍♀🏃‍♂🏃‍♀బాపురం భాషితాలు 🏃‍♀🏃‍♂🚶‍♀🚶‍♂

నీవు అమితంగా ఇష్టపడినవారు... 
వారు నీ జతలోనే ఎప్పటికీ ఉంటే మంచిదని నీవు భావిస్తున్నప్పటికీ కొంతమంది నిన్ను వదలి వెళ్ళిపోతుంటారు. 
అది నీకు బాధను కలిగించినా ఆ బాధనుండి నీవు వీలైనంత త్వరగా తేరుకోవడం తప్పనిసరి. 
వెళ్ళేవారిని నీతో ఉండమని ప్రాధేయపడటం నిన్ను నీవు తక్కువ చేసుకోవడమే! 
వారలా వెళ్ళిపోవడం కూడా నీకు ఒకవిధంగా మంచిదే! 
నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు.
ఎప్పటికప్పుడు లోకంరీతిని గ్రహించి మనసును గట్టిపరచుకొని నిన్ను నీవు తీర్చిదిద్దుకోగలుగుతావు. 

🌹🌹శుభమస్తు 🌹🌹 20/01/2021 🌹🌹 #qklife #qkbaba #qkdidi #qkpoetry #qkkthoughts

Narahari Rao

చుట్టూ పరచుకున్న నిశ్శబ్ద ఆకాశం 

చిన్నబోయిన చంద్రుడు వెన్నెల మూట విప్పకుండా నిద్దరోతున్నాడు 

బిక్కు బిక్కుమంటూ ఒంటరి నక్షత్రం...

అచ్చంగా నాలాగే  #qkbaba #qkpoetry #qklife

Narahari Rao

ఆకసాన చందమామ చెలరేగి పోతున్నాడు 
తారల సరసకు చేరి సయ్యాటలాడుతున్నాడు
మిరుమిట్లు గొలిపేట్లు వెన్నెలను పంచుతున్నాడు

ఇక్కడేమో నీ చందమామ ఎదురు చూస్తున్నాడు
సందిట చేరే తారవైన నీకోసం వేచియున్నాడు 
మోమున విలసిల్లే కాంతివి నీవై రమ్మంటున్నాడు #qklove #qkpoetry #qklife

Narahari Rao

నీవే నేను 
నేనే నీవు 
నీవు లేని నేను లేను 
నీవు లేనప్పుడు 
నాకంటూ నేను కూడా 
మిగలను కృష్ణా...!

                             అవునవును 
                             నిజమదే మరి 
                             నాలోనే నీవున్నావుగా 
                             నీవంటూ వేరే లేనే లేవు 
                             నానుండే నీవు
                             నాతోనే నీవు రాధా...!! 

 #qklove #qkpoetry #qkbaba
loader
Home
Explore
Events
Notification
Profile