Nojoto: Largest Storytelling Platform

Best ఓదార్పు Shayari, Status, Quotes, Stories

Find the Best ఓదార్పు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఓదార్పు meaning in english, ఓదార్పు translation in english, ఓదార్పు translation, ఓదార్పు మాటలు, ఓదార్పు కవితలు,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు 80 #రుబాయి #రుబాయిలు #ఓదార్పు #ప్రేమ

read more
మదిని చీల్చు జ్ఞాపకాలు ఇంకెందుకు వదిలేయక
కళను రాల్చు ఆలోచన నేడెందుకు కరిగించక
ప్రేమంటే కన్నీళ్లా? వివరమెరుగు ఓ మనసా..
బ్రతుకు కాల్చు ఆ నేస్తం ఇపుడెందుకు విడిచేయక #వన్నెలయ్య_రుబాయిలు 80 #రుబాయి #రుబాయిలు #ఓదార్పు #ప్రేమ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 71 #గజల్ #గజల్స్ #ఓఓదార్పు #ఓదార్పు #gazallover #gazal

read more
ఈడొచ్చిన చినదానికి మొగుని రాక ఓదార్పు
ప్రేమించిన కుర్రాడికి చెలియ రాక ఓదార్పు

నీటి చెమ్మ జాడ లేక వసుధ గుండె పగిలిందీ
బీడుబడిన నేలమ్మకు వాన రాక ఓదార్పు

వేడుకలను కాంక్షించీ వేదనలను ఓర్చిందీ
గాయపడిన వేణువుకూ కృష్ణ రాక ఓదార్పు

కళ తప్పిన మాను మేను కూల్చేందుకు గాలి గోల
శిశిరమంచు వనసీమకు చిగురు రాక ఓదార్పు

మూడు దశల జీవితాన శోకమెంతొ వన్నెలయ్య
బాధలలో మోము పైన నవ్వు రాక ఓదార్పు #వన్నెలయ్య_గజల్ 71
#గజల్ #గజల్స్ #ఓఓదార్పు #ఓదార్పు #gazallover #gazal


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile