Nojoto: Largest Storytelling Platform

Best కవిత Shayari, Status, Quotes, Stories

Find the Best కవిత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కవితలు in telugu, కవిత్రయం అని ఎవరిని అంటారు, కవితలు తెలుగు, కవిత పాట, కవిత వికృతి పదం,

  • 6 Followers
  • 28 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#ప్రకృతి #వెన్నెల #కవిత #yqkavi #తెలుగు #teluguquotes #ఏకవాక్యకవిత #YourQuoteAndMine sree viswanath Mouni Kanna📝 Sudha Vemuri Collaborating with Shiva Keshava Collaborating with Varoodhini Prasad Collaborating with sree viswanath

read more
చందమామతో జత కూడిన విన్నెలమ్మ....దేనికమ్మ ఓ.....వెన్నెలమ్మ  #ప్రకృతి #వెన్నెల #కవిత #yqkavi #తెలుగు #teluguquotes  #ఏకవాక్యకవిత  #YourQuoteAndMine sree viswanath Mouni Kanna📝 Sudha Vemuri
Collaborating with Shiva Keshava 
Collaborating with Varoodhini Prasad   
Collaborating with sree viswanath

srilatha lion

#ఇష్టం #కవిత #నవ్వు

read more
నీకిష్టమని కవిత నవ్వింది... #ఇష్టం #కవిత #నవ్వు

srilatha lion

కవి నీ పేరు విన్నా నీ నోటిఫికేషన్ వచ్చినా నాకు ముందు తట్టేది నీ పాజిటివిటీ.. సందర్భమేదైనా నువు నిశ్చలంగా ఉంటావ్ కూసింతైనా నిరాశ,నిస్పృహలనేవి తొంగి చూడక... పదాలన్ని స్పూర్తి వైపు నడిపించడమే నీ నడక.. పలకరింపులో ప్రేమ,ఉల్లాసం చిరునగవు ఆభరణం ప్రత్యేకించి నీ,నా బెస్టీ పేర్లు కూడా కవినే #Telugu #testimonial #teluguvelugu #yqkavi #కవిత #telugutestimonial

read more
పాజిటివిటీ ప్రియ
నిశ్చలత లయ

ఉల్లాస వ్యాఖ్యాత
మేల్కొలుపు కవిత

ఆనంద వలయ
మైత్రి ప్రణయ  కవి నీ పేరు విన్నా నీ నోటిఫికేషన్ వచ్చినా 
నాకు ముందు తట్టేది నీ పాజిటివిటీ..
సందర్భమేదైనా నువు నిశ్చలంగా ఉంటావ్ కూసింతైనా నిరాశ,నిస్పృహలనేవి తొంగి చూడక...
పదాలన్ని స్పూర్తి వైపు నడిపించడమే 
నీ నడక..
పలకరింపులో ప్రేమ,ఉల్లాసం
చిరునగవు ఆభరణం
ప్రత్యేకించి నీ,నా బెస్టీ పేర్లు కూడా కవినే

srilatha lion

#కవిత #నువ్వు #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #teluguvelugu

read more
సముద్రమంత సమస్యలో ఒక్క నీటిచుక్కంత 
అవకాశం మిగిలుందనుకుని ఊపిరికి ఊపిరల్లింది.
ఆ నీటిచుక్క సైతం ఆశను నీరుగారేలా చేస్తుందని 
ఊహించినా చిత్తమును నమ్మించలేకపోయింది.
నమ్మించినా నమ్మించకపోయిన చిత్తమెరుగని 
చిత్రముండునా చినవాడి గూర్చి.
ఏదో తనకి తాను సర్దిచెప్పుకుంటూనే 
పిచ్చిరాతల కోవెల్లో తనని కొలవుంచుటకై బానిసైంది. 
ఎంత బానిసైనా ఎంత కొలిచినా వెలితి వెక్కిరిస్తూనే ఉంది. 
క్షణక్ష‌ణం చిత్రవదను సరికొత్తగ పరిచయం చేస్తూనే ఉంది. 
అదేదో కొత్త అతిధిని ఆతిథ్యానికి పిలిచినట్టే. 
ఓపికే ఓపిక వహించడం అతి పెద్ద గ్రహపాటేమో మరి!
ఎంత అక్షరీకరించినా ఎన్ని కవనాల్లో వెతనంతా వెల్లగక్కినా 
ఇంకా ఇంకా రాయిస్తూనే ఉంది బాధనే సిరాను చేసి. 
అక్షయపాత్రకు మల్లే వెలికి తీస్తూనే ఉంది 
శిథిలమైన మదిగూటి నుండి కవితానిక్షేపాల్ని. 
ఇదేం విడ్డూరమనుకుని తడిమి చూస్కుందామనుకునే 
లోపే నీకు సహస్త్ర కవితార్చన చేయించి కవయిత్రని చేసింది. 
నన్ను నీతో పాటుగా అక్షరప్రేయసిని చేసింది. #కవిత #నువ్వు #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #teluguvelugu

srilatha lion

#yqkavi #Telugu #కవిత #YourQuoteAndMine Collaborating with Aparna Devarakonda తెలుగు 5/365 Collaborating with Sai Thanmae Collaborating with Srinivas Nagireddy Collaborating with Laxmi Narayana

read more
చైతన్యపరిచేంత గొప్పవి కావు
కొట్టిపారేసేంత పిచ్చిరాతలు కావు
నా కైతభావాలు #yqkavi 
#telugu 
#కవిత #YourQuoteAndMine
Collaborating with Aparna Devarakonda   
తెలుగు 5/365
Collaborating with  Sai Thanmae
Collaborating with Srinivas Nagireddy
Collaborating with Laxmi Narayana

srilatha lion

#yqbaba #yqkvi #sltelugu #కవిత #teluguvelugu love quotes by srilatha lion #srilathalion #Telugu

read more
కవి దాహాన్ని పరోక్షంగా తీర్చి
ప్రత్యక్షంగా స౦తృప్తినిచ్చే 
తాయిల౦ కవిత
కవి మనోభావానికి 
దృశ్యరూప౦ కవిత #yqbaba #yqkvi #sltelugu #కవిత #teluguvelugu #love quotes by srilatha lion #srilathalion #telugu

Suryasamudra Sasura

నా #శ్వాసతో నీ #మెడలో #రాయడానికి ఒక #అందమైన #కవిత ఉంది #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Naresh Reddy Aleti

#కవిత

read more
అవును
ఇప్పుడు ఏ గదిలో చూసినా
అయిదో గోడ నిలువెత్తునా,
ఛేదించలేనంత దృఢంగా ఏర్పండింది
మనిషికి మనిషికి మధ్య.!

హు అవును
ఇప్పుడు ప్రతీ చోట
అయిదో దిక్కు ప్రత్యక్షమయింది
అది
మనందరిని తన ఇష్టానికి శాసిస్తున్నది.!

అవునవును
ఇప్పుడు అయిదో వేదం భారతం కాదు
ఎక్కడైన అహంకారి
తాను పలికిందే వేదం అంటాడు కదా.!  #కవిత

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_వచన_కవిత #వచనకవిత #కవిత #చెట్టు

read more
శీర్షిక: ఆ చెట్టు

ప్రయాణంలో..
బస్సు కిటికీలోంచి
కొమ్మలు చాచి
కరచాలనం చేసింది.!

సూర్యుడు రాగానే
నేను పనికెళ్ళి అలసిపోతే,
సూర్యుడిని ఓడించి, గిర్రున తిరిగే ఛత్రంలా మారి
నల్లని నీడై పోయింది.!

ఎముకలే
ఎండిపోయిన కొమ్మలు తన దేహంలో..
కట్టెల మోపై నెత్తినెక్కి
పొయ్యిలో దిగి ఆహుతై
కడుపు మంట చల్లార్చింది.!
"పరోపకారాయ ఫలంతి వృక్షాః" #వన్నెలయ్య_వచన_కవిత #వచనకవిత #కవిత #చెట్టు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 309 #గజల్ #కవిత

read more
ఊహలకే ఊపిరినే పోయకుండ ఉండలేను.!
మీ అందరి గుండెలలో దాచకుండ ఉండలేను.!

పురిటినొప్పు లెన్నివేలొ కవితకన్య జననంలో
అక్షరమై ప్రభవించీ బ్రతకకుండ ఉండలేను.!

అహము తట్టి ఈర్ష పుట్టి వారెవ్వా అనకున్నా..
హృదయాలను ఊయల్లను చేయకుండ ఉండలేను.!

కాళ్ళు బయట కదలలేదు మనసు ఇంట ఉండలేదు
ఊసులన్ని కలము చెవికి చెప్పకుండ ఉండలేను.!

వన్నెలోడు విరచించే కావ్యాలను చూడిప్పుడు
చెదిరిపోని సంతకమై మిగలకుండ ఉండలేను.! #వన్నెలయ్య_గజల్ 309 #గజల్ #కవిత
loader
Home
Explore
Events
Notification
Profile