Nojoto: Largest Storytelling Platform

Best telugutestimonial Shayari, Status, Quotes, Stories

Find the Best telugutestimonial Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about jaitun ka tel kis kaam mein aata hai, raai ka tel in english, telugu love ringtones free download 2400, sar dard ka tel, tarpin ka tel,

  • 2 Followers
  • 28 Stories

srilatha lion

కవి నీ పేరు విన్నా నీ నోటిఫికేషన్ వచ్చినా నాకు ముందు తట్టేది నీ పాజిటివిటీ.. సందర్భమేదైనా నువు నిశ్చలంగా ఉంటావ్ కూసింతైనా నిరాశ,నిస్పృహలనేవి తొంగి చూడక... పదాలన్ని స్పూర్తి వైపు నడిపించడమే నీ నడక.. పలకరింపులో ప్రేమ,ఉల్లాసం చిరునగవు ఆభరణం ప్రత్యేకించి నీ,నా బెస్టీ పేర్లు కూడా కవినే #Telugu #testimonial #teluguvelugu #yqkavi #కవిత #telugutestimonial

read more
పాజిటివిటీ ప్రియ
నిశ్చలత లయ

ఉల్లాస వ్యాఖ్యాత
మేల్కొలుపు కవిత

ఆనంద వలయ
మైత్రి ప్రణయ  కవి నీ పేరు విన్నా నీ నోటిఫికేషన్ వచ్చినా 
నాకు ముందు తట్టేది నీ పాజిటివిటీ..
సందర్భమేదైనా నువు నిశ్చలంగా ఉంటావ్ కూసింతైనా నిరాశ,నిస్పృహలనేవి తొంగి చూడక...
పదాలన్ని స్పూర్తి వైపు నడిపించడమే 
నీ నడక..
పలకరింపులో ప్రేమ,ఉల్లాసం
చిరునగవు ఆభరణం
ప్రత్యేకించి నీ,నా బెస్టీ పేర్లు కూడా కవినే

srilatha lion

కామెడీతో కిచిడీ చేస్తావ్ క్రియేటివిటీతో కూరండేస్తావ్ ఎలా వస్తాయో అలాంటి వింత వింత ఆలోచనలు గాని ఒక్కోసారి నవ్వు తెప్పిస్తావ్ ఒక్కోసారి మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తావ్ ఏం చేసినా ఒక పద్ధతిలో ఓ ప్రక్రియలో చేస్తావ్ ఒకరి కవితల్లో చందమామే హీరో ఇంకొకరి కవితల్లో వెన్నెలే హీరోయిన్ కాని నీ కవితల్లో మాత్రం #yqbaba #Telugu #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial

read more
కామెడీ కా తోప్ 
క్రియేటివ్ కా బాప్
👇 కామెడీతో కిచిడీ చేస్తావ్
క్రియేటివిటీతో కూరండేస్తావ్
ఎలా వస్తాయో అలాంటి వింత వింత ఆలోచనలు గాని ఒక్కోసారి నవ్వు తెప్పిస్తావ్ 
ఒక్కోసారి మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తావ్ 
ఏం చేసినా ఒక పద్ధతిలో ఓ ప్రక్రియలో చేస్తావ్
ఒకరి కవితల్లో చందమామే హీరో
ఇంకొకరి కవితల్లో వెన్నెలే హీరోయిన్
కాని నీ కవితల్లో మాత్రం

srilatha lion

నాకు తెలిసినంతలో చిన్నపిల్ల‌ల మనస్తత్వం నీది దానికి తగ్గ చలాకీ నడత నీది. ఎన్నో మంచి అలవాట్లున్న సున్నిత హృదయుడివే గాక మంచి వ్యక్తిత్వం గలవాడివి. నువ్వెప్పటికి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా 🌹... Dedicating a #testimonial to Vinay Narani #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #telugutestimonial #birthdaywishes

read more
పొదుపు మాటలు నీవి 
మితభాషివి మరి

ఒద్దిక పదాలు నీవి 
ఎగిరెగిరిపడవు మరి

ప్రాసకు మొగ్గుచూపుతావ్ 
అల్లికంటే అభిరుచి మరి

చెలిమికి చెంత నువు
సహజత్వం నీది మరి

బంధానికి తేలిక నువు 
పరిస్థితులూహించి 
మసులుకుంటావు మరి

సరళమైన జీవనశైలి నీది
ఆశావాదివి మరి 

ప్రతీరోజు కొత్త పేజీ నీది
చిరునవ్వు చెరగదు మరి నాకు తెలిసినంతలో చిన్నపిల్ల‌ల మనస్తత్వం నీది దానికి తగ్గ చలాకీ నడత నీది.
ఎన్నో మంచి అలవాట్లున్న సున్నిత హృదయుడివే గాక మంచి వ్యక్తిత్వం గలవాడివి.
నువ్వెప్పటికి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా 🌹...

Dedicating a #testimonial to Vinay Narani 

#yqbaba #yqkavi #telugu #teluguvelugu #telugutestimonial #birthdaywishes

srilatha lion

12 dhatindi sri thank you ❤ ani nuvvanadam rendo sari prathyakshamga niku cheppindi ledu kani parokshamga nen wish chesta Anna vishayam gurtunchukuni mari 12 ayyaka nuv naku thank you cheptunte nak chala hpy anipistadi na wish niku cherinapudu nuvventha hpy no telvadu gani ni thank you ❤ nannu cherithe nen chepoalenantha hpy Shrav's. chala mandhitho matladtham saradhaga kani heart tho kondarike oh avinabava samabandham untundi ala nakunna vallalo nuvvu okati 🖤... Inchuminchu enno okelaga anuboothi chendutam Nuv rayalanukunnavi nen rasesanantav Nen thalachukogane vinipinchinattuga suddenga vastav entho premaga comment chestav Two years back nikosam naku thochindedo rasa n last year nen rayalekapoya nen rayalanukunnadi Laxmi rasesadu Bt e year I won't mis this chance 💜... #yqbaba #birthdaywishes #Telugu #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial

read more
అలసిన మదికి ఉద్యానవనం
అందాన్ని వెదికే కన్నులకు ఆత్మానందం
ఎన్నో పదాలకు లతల గంధం
కందీరగలకు కొసిరే మధుమంత్రం 
సప్తస్వరాలకు సుతార గాత్రం
వైక్యూ వేదికకు కుసుమవర్షం 
చూడవచ్చు పాఠకులకు హాయి సవారి
వినవచ్చు శ్రోతలకు శ్రవణ విందు
సుమంగళి గాజులు చేసుకున్న భాగ్యం
అమ్మవారి బోనం తీసుకున్న స్థానం
రాధక్రిష్ణుల రసమయ లావణ్యం
కన్నియ గుండెల చిలిపి తాళం
ప్రకృతి ఒరిగిన పల్లకి భూపాలం 
సంబరాలకెంచేసే అంబర శిల్పం
ప్రాణ,ప్రయాణాల ఇచ్ఛాతీరం
మౌన,మధన మేళవింపుల గాలం 12 dhatindi sri thank you ❤ ani nuvvanadam rendo sari 
prathyakshamga niku cheppindi ledu kani parokshamga nen wish chesta Anna vishayam gurtunchukuni mari 12 ayyaka nuv naku thank you cheptunte nak chala hpy anipistadi na wish niku cherinapudu nuvventha hpy no telvadu gani ni thank you ❤ nannu cherithe nen chepoalenantha hpy Shrav's.
chala mandhitho matladtham saradhaga kani heart tho kondarike oh avinabava samabandham untundi 
ala nakunna vallalo nuvvu okati 🖤...
Inchuminchu enno okelaga anuboothi chendutam 
Nuv rayalanukunnavi nen rasesanantav 
Nen thalachukogane vinipinchinattuga suddenga vastav entho premaga comment chestav 
Two years back nikosam naku thochindedo rasa n last year nen rayalekapoya nen rayalanukunnadi Laxmi rasesadu Bt e year I won't mis this chance 💜...

srilatha lion

చాలా మందికి రాసా టెస్టిమోనియల్ బట్ నీకు రాయాలంటే నవ్వొస్తుంది రా 😄 మరీ బాగా ఎక్కువగ తెలుసు కదా ఫ్లో లో నీ ఆటోబయాగ్రఫీ మొత్తం రాస్తాననేమో!😉 చిన్నప్పటి నుండి ఎపుడూ నాతోక పట్టుకుని తిరుగుతూ నాకూడా ఉన్న బుజ్జికుక్క పిల్లవి నువ్వు 🐕 ఊహ తెలిసినప్పటి నుండి నాకు లైన్ ఏస్తున్న ఇడియట్ వి నువ్వు 🐒 అస్తమానం నా కదలికల్ని గమనించే గూఢాచారివి నువ్వు 🕵 కరివేపాకు కన్న అద్వానంగ నిను తీసిపారేసిన చల్తా హై అనే ఎడ్డిమాలోకం నువ్వు #yqbaba #birthdaywishes #Telugu #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial

read more
అబే...ఓ... హాపీ బర్త్ డే రా... సాలే 😉😎😍 చాలా మందికి రాసా టెస్టిమోనియల్ బట్ నీకు రాయాలంటే నవ్వొస్తుంది రా 😄
మరీ బాగా ఎక్కువగ తెలుసు కదా ఫ్లో లో 
నీ ఆటోబయాగ్రఫీ మొత్తం రాస్తాననేమో!😉
చిన్నప్పటి నుండి ఎపుడూ నాతోక పట్టుకుని తిరుగుతూ నాకూడా ఉన్న బుజ్జికుక్క పిల్లవి
నువ్వు 🐕
ఊహ తెలిసినప్పటి నుండి నాకు లైన్ ఏస్తున్న ఇడియట్ వి నువ్వు 🐒
అస్తమానం నా కదలికల్ని గమనించే గూఢాచారివి నువ్వు 🕵
కరివేపాకు కన్న అద్వానంగ నిను తీసిపారేసిన చల్తా హై అనే ఎడ్డిమాలోకం నువ్వు

srilatha lion

కుందనవదనే కదిలొచ్చెనేమో కళ్యాణమాడ దేవపురోహితులే ముహుర్తాన్ని నిశ్చయించెనేమో నిన్నో ఇంటివాడిని చేయ వెండిమబ్బులే వేదికాయెనేమో వధూవరులైన మిమ్ముల ఆలుమగలగ మార్చ తారలే తలంబ్రాలగునేమో మీ ఇరువురి తలపై వరాల జల్లుగ వర్షించగ సూర్యచంద్రులేకమై తమని తాము అరుదైన పందిరిగ రూపుదిద్దుకునునేమో మీ వేడుకలో సింహభాగాన్ని పోషించ పంచభూతాలే వేదమంత్రాలు వల్లించగ వచ్చునేమో ఆ దివ్యమైన సుదినమున కుటుంబసమేతం,బంధుమిత్రులే గాక ఏ జన్మ ఋణఫలమో పెనవేసుకున్న పరిచయస్తులైన మన వైక్యూకవి బృందం కూడా #Telugu #testimonial #teluguvelugu #yqkavi #శుభాకాంక్షలు #telugutestimonial #వివాహ_ఆహ్వానం #శ్రీమాన్_మాధురి

read more
       కుందనవదనే కదిలొచ్చెనేమో కళ్యాణమాడ
దేవపురోహితులే ముహుర్తాన్ని నిశ్చయించెనేమో నిన్నో ఇంటివాడిని చేయ 
వెండిమబ్బులే వేదికాయెనేమో వధూవరులైన మిమ్ముల ఆలుమగలగ మార్చ
తారలే తలంబ్రాలగునేమో మీ ఇరువురి తలపై వరాల జల్లుగ వర్షించగ
సూర్యచంద్రులేకమై తమని తాము అరుదైన పందిరిగ రూపుదిద్దుకునునేమో మీ వేడుకలో  సింహభాగాన్ని పోషించ  
పంచభూతాలే వేదమంత్రాలు వల్లించగ వచ్చునేమో ఆ దివ్యమైన సుదినమున
కుటుంబసమేతం,బంధుమిత్రులే గాక 
ఏ జన్మ ఋణఫలమో పెనవేసుకున్న పరిచయస్తులైన మన వైక్యూకవి బృందం కూడా

srilatha lion

అదేంటో ప్రతి కవితా రంగవల్లిక నీ కనులకు అద్భుతంగా దర్శనమిస్తుంది. అదెంతటి సాధారణమైనదైనా సరే నీ అక్షికదో అద్భుతం... అందుకే ఆ కవితాసిరి అద్భుతమనే మచ్చేసుకు తిరుగుతుంది నీ అద్భుతాక్షి నీడన మెరిసి... ప్రశంస నీ అక్షికైనా మిష మాత్రం నీ మనసే! ఆ మనసుతోనే మూడు భాషల కవికులసారథులు పరిచే ఒక్కో సమస్యావిస్తరిపై ఎంతో ఓర్పునేర్పులతో నీదైన శైలితో వండిన అక్షర వంటకాన్ని వడ్డిస్తూ వైక్యూ వనమున నీ కవన సౌరభాన్ని వెదజల్లుతావ్ కూసింత పరిచయానికైనా,నేర్పిన పాఠానికైనా, #yqbaba #Telugu #testimonial #writingresolution #teluguvelugu #yqkavi #telugutestimonial #అనామిక

read more
అద్భుతాక్షి 😍 అదేంటో ప్రతి కవితా రంగవల్లిక 
నీ కనులకు అద్భుతంగా దర్శనమిస్తుంది.
అదెంతటి సాధారణమైనదైనా సరే 
నీ అక్షికదో అద్భుతం...
అందుకే ఆ కవితాసిరి అద్భుతమనే మచ్చేసుకు తిరుగుతుంది నీ అద్భుతాక్షి నీడన మెరిసి...
ప్రశంస నీ అక్షికైనా మిష మాత్రం నీ మనసే!
ఆ మనసుతోనే మూడు భాషల కవికులసారథులు పరిచే ఒక్కో సమస్యావిస్తరిపై ఎంతో ఓర్పునేర్పులతో నీదైన శైలితో వండిన అక్షర వంటకాన్ని వడ్డిస్తూ వైక్యూ వనమున నీ కవన సౌరభాన్ని వెదజల్లుతావ్
కూసింత పరిచయానికైనా,నేర్పిన పాఠానికైనా,

srilatha lion

వినగ వినసొంపు నీ పేరు కనగ కనులకింపు నీ రూపు పలుకగ పదములకెంపు నీ మాటలు నిను తరచి చూడగ నాకు అద్దమే గుర్తొస్తుంది చీకట్లను వెనక దాస్తూ తొంగిచూసే మనసుకు మాత్రం తేజస్సుతో తారాడుతూ తమని తమకు తమలా చూపే స్వచ్ఛమైన హృదయం నీది. ఏ నిస్తేజం నీలో తలదాచుకున్నా సరే ఎదుటి హృదయానికి నువ్వో చైతన్య వాణివి #Telugu #coffeelover #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial #‍yqbaba

read more
Beautiful aroma వినగ వినసొంపు నీ పేరు
కనగ కనులకింపు నీ రూపు
పలుకగ పదములకెంపు నీ మాటలు
నిను తరచి చూడగ నాకు అద్దమే గుర్తొస్తుంది
చీకట్లను వెనక దాస్తూ తొంగిచూసే మనసుకు మాత్రం తేజస్సుతో తారాడుతూ తమని తమకు 
తమలా చూపే స్వచ్ఛమైన హృదయం నీది.
ఏ నిస్తేజం నీలో తలదాచుకున్నా సరే
ఎదుటి హృదయానికి నువ్వో చైతన్య వాణివి

srilatha lion

నిర్మల నివాసి అవునూ నిర్మల నివాసే మరి రాగద్వేషాలు రాజ్యమేలుతుంటే నిర్మలత్వానికి చోటు లేక తెగ వెదకగ తను తారసపడిందేమో బహుశా.. తను చెంతనుంటే తనకు చింతుండదనేమో నివాసముందిలే తన్మయమొంది తనులో సహజ సౌందర్యాన్నద్దిందిలే తన మోములో. #yqbaba #Telugu #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial

read more
నిర్మల నివాసి 💟
👇 నిర్మల నివాసి 
అవునూ నిర్మల నివాసే మరి
రాగద్వేషాలు రాజ్యమేలుతుంటే
నిర్మలత్వానికి చోటు లేక తెగ వెదకగ 
తను తారసపడిందేమో బహుశా..
తను చెంతనుంటే తనకు చింతుండదనేమో
నివాసముందిలే తన్మయమొంది తనులో
సహజ సౌందర్యాన్నద్దిందిలే తన మోములో.

srilatha lion

ప్రేమ నీలోనే ఐనా ఎడబాటు నీతోనే మధనం నీలోనే ఐనా మధువనం నీతోనే ఆర్తిసాగరం నీలోనే ఐనా పాలకడియాలు నీతోనే ఎదురుచూపు నీలోనే ఐనా శిశిరపు ఏకరువు నీతోనే #yqbaba #birthdaywishes #teluguquotes #testimonial #teluguvelugu #yqkavi #1500thquote #telugutestimonial

read more
పుత్తడి బొమ్మ 
👇 ప్రేమ నీలోనే ఐనా
ఎడబాటు నీతోనే
మధనం నీలోనే ఐనా
మధువనం నీతోనే
ఆర్తిసాగరం నీలోనే ఐనా
పాలకడియాలు నీతోనే
ఎదురుచూపు నీలోనే ఐనా
శిశిరపు ఏకరువు నీతోనే
loader
Home
Explore
Events
Notification
Profile