Find the Best మార్పు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about మారà±à°ªà± quotes, మారà±à°ªà±à°²à±, మారà±à°ªà±à°²à± శాసà±à°¤à±à°°à±€à°¯, మారà±à°ªà± చెందవా, మారà±à°ªà± చేపలà±,
srilatha lion
బ్రతుకులు మారాలట... మనుషులు మారాలిగా! #మనుషులు #బ్రతుకులు #మార్పు #telugu #yqkavi #teluguvelugu #telugukavi
srilatha lion
తెలీట్లేదే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో! ఎవరి నుండి ఎవరికి ఎవరిని బదిలీ చేస్తుందో! ఆలోచిస్తే గుండె గుబులు ఇక అనుభవానికొస్తే గుండెకే తెగులు ఇలాంటపుడే ఆగిపోతే బావుండనపిస్తుందీ క్షణం #ఈక్షణం #జీవితం #telugu #teluguvelugu #మార్పు #గుబులు
srilatha lion
మారిన మనసు తీరం దాటిందనే... తేరుకోటమో మునిగిపోటమో నీ వంతే! #మనసు #మార్పు #తీరం #telugu
srilatha lion
ఎక్కడ్నించి లేపావో తిరిగక్కడే వదిలేసావ్ మారిందనుకుంది మరల వెనక్కే చూసింది #మార్పు #తను #telugu
srilatha lion
జీర్ణించుకోలేనంత మార్పు జీవం తీసేంత మార్పు అంత మార్పెందుకో మార్పుకే తెలియాలి #మార్పు
srilatha lion
ఆలోచనా దృక్పదమే మార్పుకి పునాది దృక్పదాన్ని మార్చు...మార్పును గాంచు... #మార్పు #ఆలోచనాదృక్పదం #తెలుగు #yqkavi #telugu #teluguvelugu
srilatha lion
నింగిలోకి చూపు నేల మీదె అడుగు మార్పేదిక మూటగట్టి చెయ్యి ముద్ద కొరకు పరుగు మార్పేదిక పైకి జూడ పెదవంచున నవ్వు పులిమి వదిలేయక మనసునందు దాచుకొనే విషపు వరుగు మార్పేదిక మాటకేమొ మారాలని ఇతరులలా ఎదగాలని వల్లిస్తూ వదలిపోవె గతం అరుగు మార్పేదిక కష్టమంటె గిట్టదాయె కరువొస్తే ఆగమాయె వొళ్ళొంచని కాయం గతి చెదల పురుగు మార్పేదిక నిన్నటికిక నీరొదులుతు ఈనాటికి చేమటోడ్చి సాగిపోగ లతగ తనుగ పదమె మరుగు మార్పేదిక #గజల్ #మార్పు #telugu #teluguvelugu #yqkavi #మార్పేదిక #తెలుగు
srilatha lion
అందమైన అద్భుతాల వెనకేదో తొంగిచూచు అగాధమని తెలిసిరాగ లోటేదో తొంగిచూచు విహంగాన్ని జేసి ముందు తేలియాడ ఉసిగొలిపి నిలువెల్లా తేలినాక శపమేదో తొంగిచూచు మనసుకంత మాయపులిమి మనుషుల్నే వెలివేయగ ఒంటరైన ఆత్మసుతిలొ కీడేదో తొంగిచూచు నాడేదో నేడేమో తెలిసేనా నానాటికి తెలివికొస్తె నీ ఛాయలొ వరమేదో తొంగిచూచు విల్లు నీవె వింటినార నీవేనని మరువబోకు ఎక్కుపెట్టు లత నీవై మార్పేదో తొంగిచూచు #గజల్ #లత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #మార్పు
srilatha lion
మారింది కాలం మాత్రమే #కాలం #మార్పు #tinyfemtos #telugu #yqbaba #teluguvelugu
srilatha lion
నీ మార్పుకు నువ్వే అడ్డు #నానోలు #మార్పు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu