Nojoto: Largest Storytelling Platform

Best తత్వం Shayari, Status, Quotes, Stories

Find the Best తత్వం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about తత్వం means, తత్వం తత్త్వం, తత్వం అంటే ఏమిటి, తత్వం, తత్వంతో,

  • 2 Followers
  • 46 Stories
    PopularLatestVideo

srilatha lion

ఇది రాస్కున్నాక ఒకసారి చదవగానే మేడిపండు గుర్తొచ్చింది నాకు. కాని మేడిపండు లైన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం రాయలేదు 😃 #బూటకం #తత్వం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #telugukavi

read more
పైన కనిపించేదంతా ఒక బూటకం
లోన తొంగిచూడు అంతా క్రిమికీటకం ఇది రాస్కున్నాక ఒకసారి చదవగానే మేడిపండు గుర్తొచ్చింది నాకు.
కాని మేడిపండు లైన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం రాయలేదు 😃

#బూటకం #తత్వం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes #telugukavi

Naresh Reddy Aleti

#తత్వం #వన్నెలయ్య_ప్రబోధం

read more
మనం ఎక్కడ ఉండాలో
అక్కడే ఉన్నాం..
మన చుట్టూ ఎవరు ఉండాలో
వాళ్ళే ఉన్నారు..

కాని వాటి కోసం వెంపర్లాడకు
లేని వారి కోసం యద బాదుకోకు

"స్పర్శన్ కృత్వన్ బహిర్ బాహ్యన్" -భ.గీ #తత్వం #వన్నెలయ్య_ప్రబోధం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం

read more
ఎంత సులువుగ చిక్కినావే
పిచ్చి మనసా..
అతని ప్రేమ వలపు మాయలో!

        ప్రాణమంటే పొంగిపోతివి
        ప్రేమ అంటే లొంగిపోతివి

                 విడిచి పోతే కుంగిపోయి
                 ఓడిపోయి మిగిలిపోతివి

ఎంత సులువుగ చిక్కినావే
పిచ్చి మనసా..
అతని ప్రేమ వలపు మాయలో! #వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #చరవాణి #ఫోను #MOBILE

read more
లోకమెంతగ మారిపోయింది
వినవె మనసా..
హై 'టెక్కు మనుషులంతా.!

        లైకులల్లో ప్రేమ కొలత
        వివ్స్ లోనే ఘనత తెలుసా

                రేడియేషన్ చుట్టు కాగా
                నరుని బ్రతుకు ముప్పు లోనా

లోకమెంతగ మారిపోయింది
వినవె మనసా..
హై'టెక్కు మనుషులంతా.! #వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #చరవాణి #ఫోను #mobile

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #మనసు

read more
మనసు మగువా మాట వింటుందా.!?
ఎవరికైనా..
ప్రయత్నిస్తే వినక పోతుందా.!?

             ఊరిస్తవి జగతి సొగసులు
             ఉరి తీస్తవి విషయ సుఖములు

                      కనుక మనసును నిలువరించు
                      కనక సుఖముల ననుభవించు

మనసు మగువా మాట వింటుందా.!?
ఎవరికైనా..
ప్రయత్నిస్తే వినక పోతుందా.!? #వన్నెలయ్య_తత్వగీతం #తత్వగీతం #తత్వం #మనసు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 272 #గజల్ #తత్వం

read more
తనువు గాలి పీల్చనపుడు బొంద పాలు తెలిసిందా.!?
ఆయువింక కరిగిపోతె యముని పాలు తెలిసిందా.!?

ప్రాణదీప మారినాక మేని తళుకు రంగెక్కడ.?
తెగ కులికిన ఈ దేహం అగ్గి పాలు తెలిసిందా.!?

నాది నాకు అంటు ఎంతో ఆర్జించిన వెటుపోయె.?
నీవు లేక సంపదంత పరుల పాలు తెలిసిందా.!?

పది కట్టెలు ఒక కట్టెను కాల్చినాక ఏముండును.?
మిగిలిపోతె అస్థికలు గంగ పాలు తెలిసిందా.!?

శాస్త్రీయత అంతంతే 'e' కాలం దినకర్మలో
వన్నెల్లో పిండమైన కాకి పాలు తెలిసిందా.!? #వన్నెలయ్య_గజల్ 272 #గజల్ #తత్వం

Naresh Reddy Aleti

#తత్వం

read more
జీవితం చాలా చిన్నదంటారు...
నిజమేనా.!?
అని ప్రశ్నించింది ఆమె...

అపరిమితమైన విశ్వంతో పోల్చి చూస్తే
చిన్నదే కావచ్చు...
పరిమితమైన మనో పరిధిలో
చాలా పెద్దదని చెప్పాను నేను...
" జిజీవిశేత్ శతం సమ: " #తత్వం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #బ్రహ్మ #తత్వం

read more
ఆదిలో పూర్ణమట
చివరలో పూర్ణమట
ఇంతకీ ఆద్యంతా..
మధ్యలో కథేంటట.!?

మారనిదే సత్యమాయె
ఎప్పుడుంటె నిత్యమయె
రెండు కాని ఈ జగతి..
కళ్ళముందు మిథ్యాయె.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #బ్రహ్మ #తత్వం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 261 #గజల్ #తత్వం ఏ దృశ్యంలో ఎవరు ఏది చూస్తారో...

read more
యదకొమ్మకు 'నేను' విచ్చి ఊగుతుంది తెలిసిందా.!?
అహమెంతో మేను చూసి ఊరుతుంది తెలిసిందా.!?

వాసంతం అడుగు ఆగె కాలమేది రాదా.?
ముదిమి వచ్చి ఒక్క రోజు కుదుపుతుంది తెలిసిందా.!?

నీవు కాని నీడ చూసి మురిసిపోకు ఓ లలనా
అనాదిగా అజ్ఞానం పారుతుంది తెలిసిందా.!?

మురిసిపోయి మిడిసిపడీ అత్తరెంత పూసావో
సౌందర్యం ఒక్కచోట కాలుతుంది తెలిసిందా.!?

కల్లలనూ ఎరుక చేసె కళలు గొప్ప వన్నెలమ్మ
కల బ్రతుకని కలము కదిలి తెలుపుతుంది తెలిసిందా.!? #వన్నెలయ్య_గజల్ 261  #గజల్ #తత్వం
ఏ దృశ్యంలో ఎవరు ఏది చూస్తారో...

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #తత్వం #వైరాగ్యం

read more
రోజు రోజుకూ
తరిగిపోతుంది ఆయువు
శ్వాస శ్వాసకూ
తరలిస్తుంది వాయువు


మనసా చెప్పవే మనుగడ
ఎంత కాలం.!? #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #తత్వం #వైరాగ్యం
loader
Home
Explore
Events
Notification
Profile