Nojoto: Largest Storytelling Platform

Best vnlmt Shayari, Status, Quotes, Stories

Find the Best vnlmt Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 39 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 74 #వన్నెలయ్య_పండగ #గజల్ #గజల్స్ #హోళీ #ప్రేమికులు #vnlmt మా వలపుకు యదలపైన*

read more
మా ప్రేమకు బాధలలో తుడుచుకున్న కనులు సాక్షి.!!
సరదాలకు యదలపై వేసుకున్న పూలు సాక్షి.!!

మృదుభాషిణి మేని సోకు తాకినట్టు ఋజువడిగితె
విరబూసిన పూదోటలొ కలుసుకున్న చోటు సాక్షి.!!

సప్తవర్ణ జీవితాన్ని కోరుచర్యలేవనగా
హోళి రోజు నవ్వుకుంటు పూసుకున్న రంగు సాక్షి.!!

యదలోతును చెలి ముందర చూపింది ప్రేమ రోజు
నా హృదయం తాజ్ మహల్ ఇచ్చుకున్న గుర్తు సాక్షి.!!

ఏనాటికి ఇంకిపోని నాప్రేమను ప్రశ్నిస్తే
తనను తాక బోయినపుడు నొచ్చుకున్న జనం సాక్షి.!!

వన్నెలయ్య తమకములో ఆమె కాక ఇంకెవరూ?
తలపంతా తపననింపి రాసుకున్న లేఖ సాక్షి.!! #వన్నెలయ్య_గజల్ 74
#వన్నెలయ్య_పండగ #గజల్ #గజల్స్ #హోళీ #ప్రేమికులు 
#vnlmt మా వలపుకు యదలపైన*

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 63 #గజల్స్ #గజల్స్ #vnlmt ఇవ్వాలని*

read more
హంస లాగ బ్రతకాలని మనసేదో గోల చేయు
హింస లన్ని విడవాలని దినుసేదో గోల చేయు

సంబంధం లేదసలే రైతు పంట తడిపె మొయిలు
చేయూతను ఇవ్వలని కరమేదో గోల చేయు

క్రింది చూపు లేదసలే ఆకాశం పాకె లత
తీక్షణతో చూడాలని కనులేదో గోల చేయు

వెనక తిరిగి రాదసలే ముందునకే సాగు నదము
గమ్యాలను చేరాలని అడుగేదో గోల చేయు

నిట్టూర్పే లేదసలే చదువుతుంటె గజల్ గీతి
వన్నెలోన్ని వ్రాయమని కలమేదో గోల చేయు #వన్నెలయ్య_గజల్ 63
#గజల్స్ #గజల్స్
#vnlmt ఇవ్వాలని*

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ90 #మొగ్గలు #వన్నెలయ్య_మొగ్గలు ఏమైనా, కరోనా.. గోడ దాటించింది చైనా! #vnlmt

read more
చరిత్రలో నిలిచిన గోడలు గొప్పవైతేనేం,
లోకహితం కోరనపుడు, రక్షిణ నీయనపుడు..
ఏమైనా, కరోనా దాటించింది చైనా వాల్! #సమస్యాపూరణ90 #మొగ్గలు #వన్నెలయ్య_మొగ్గలు
ఏమైనా, కరోనా.. గోడ దాటించింది చైనా!
#vnlmt

Naresh Reddy Aleti

#ప్రహేళిక #పింగళివెంకయ్య #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #జెండా #vnlmt కాషాయం*

read more




కాశాయం రంగునందు బలిదానం చూడవేల
వెండి వన్నె తెలుపునందు మనగమ్యం చూడవేల
మువ్వన్నెల జెండాలో కులమతాల గొడవెందుకు?
పచ్చదనం నందు జీవ వైవిధ్యం చూడవేల #ప్రహేళిక #పింగళివెంకయ్య #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #జెండా  #vnlmt కాషాయం*

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 59 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #వన్నెలయ్య_ప్రేమ #గజల్ #గజల్స్ #vnlmt దారులన్ని*

read more

గుండె వేయు తాళాన్నీ చూడ రావు ఎందుకని
మనసు కోరు గీతాన్నీ పాడ రావు ఎందుకని

మనసంతా గాయాలయి ఒంటరినై మిగిలినాను
విధిని దాటు వేళలలో తోడు రావు ఎందుకని

కలల నగము చేరాలని వడి వడిగా సాగినాను
నవజీవన నిర్మాతను మరపు రావు ఎందుకని

ఎన్నెన్నో వర్ణాలూ ఏ రంగుతొ వేసావో
గుండె గోడ నీబొమ్మను చెరప రావు ఎందుకని

నువు నడిచిన దారులే సరియైనవి అంటావేం
వన్నెలయ్య ప్రేమ పథము ఆడ రావు ఎందుకని #వన్నెలయ్య_గజల్ 59 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#వన్నెలయ్య_ప్రేమ #గజల్ #గజల్స్
#vnlmt దారులన్ని*

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 56 #bmpicquote352 🎀Collab with Buddy Mantra and decorate this bg with beautiful words.😍 🎀Use hashtag #buddymantra for us to discover your writings. #yqbaba #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #vnlmt #గజల్స్

read more
ఏ కాంతీ చూపుతుంది పగిలి ఉన్న నా హృదయం
ఏ శాంతీ ఆర్పుతుంది జ్వలిస్తున్న నా హృదయం

యుగాలెన్నొ ఈడ్చినట్టు ఒక్క బతుకు తోస్తుంటే
ఏ క్షణమున గెలుస్తుంది కోరుతున్న నా హృదయం

ఎద పగిలిన గుండెలోన చిన్ని ఆశ ఎందుకనో
తనకెప్పుడు తెలుస్తుంది మిగిలి ఉన్న నా హృదయం

వసంతాలు వచ్చిపోయె మోడు కూడ చిగురించే
తన రాకను కోరుతుంది రాలుతున్న నా హృదయం

వన్నెలయ్య నొదిలేసే వన్నె లొలుకు ఓ చిలకా
తన కొరకే మూల్గుతుంది ఆడుతున్న నా హృదయం #వన్నెలయ్య_గజల్ 56
#bmpicquote352

🎀Collab with Buddy Mantra and decorate this bg with beautiful words.😍

🎀Use hashtag #buddymantra for us to discover your writings.

#yqbaba #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #vnlmt జాబిల్లిలొ నిండుదనం*

read more
విరులలోని మకరందం నింపుకుంది తెలుగు భాష
పండ్లలోని తియ్యదనం ఒంపుకుంది తెలుగు భాష
దేశ భాష లందు నేడు తెలుగు భాష గీర్వాణం..
జాబిల్లిలొ పూర్ణత్వం తెంపుకుంది తెలుగు భాష #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు 
#vnlmt జాబిల్లిలొ నిండుదనం*

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 55 #గజల్ #గజల్స్ #vnlmt వలపు మొక్క* విరహవీణ యదలోనా*

read more
వలపులను నాలోనా నాటినావు దొరసానీ
విరహాలను యదలోన మీటినావు దొరసానీ

విరులలోని మరందాలు ప్రియకములే తాగినట్టు
నా మదిలో ప్రేమ వెన్న దోచినావు దొరసానీ

ఓరుగాలి చెట్లన్నీ విల్లు వలే ఒంపినట్టు
కనుచూపులు నీవైపుకు లాగినావు దొరసానీ

చిరుజల్లులు చిరుబుడతలు అలికిడేదొ చేసినట్టు
నా గుండెల గజ్జల సడి రేపినావు దొరసాని

ఉషస్సుకే విహంగాలు స్వాగతాలు చెప్పినట్టు
చరవాణికి లేఖలను పంపినావు దొరసానీ

బాపు బొమ్మ ఇష్టపడే వన్నెలయ్య కోరినట్టు
నా కలమున తెలుగు వలే ఆడినావు దొరసానీ #వన్నెలయ్య_గజల్ 55
#గజల్ #గజల్స్ 
#vnlmt వలపు మొక్క* 
విరహవీణ యదలోనా*

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #vnlmt.తెలిసెనే*

read more

సంతసం మది ఇంట
తెలిసినే తన కంట
పండితే గోరింట
ఓ వన్నెలమ్మ! #వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #vnlmt.తెలిసెనే*

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #vnlmt తోడా*

read more

నెలవంక దాల్చాడు
శూలమ్ము పట్టాడు
అంబ తోడ భవుడు
ఓ వన్నెలమ్మ! #వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు
#vnlmt తోడా*
loader
Home
Explore
Events
Notification
Profile