Nojoto: Largest Storytelling Platform

New kavita telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about kavita telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

gopi kiran

Poetry #Telugu #kavita #telugupoetry

read more

gopi kiran

amaterasu

కనులుండి ఏం లాభం వెలుతురు లేనప్పుడు
కరములుండి ఏం లాభం కార్యం లేనప్పుడు
కాళ్ళుండి ఏం లాభం చలనం లేనప్పుడు
చెవులుండి ఏం లాభం శబ్దం లేనప్పుడు

వెన్నెలుండి ఏం లాభం చీకటి లేనప్పుడు
నింగియుండి ఏం లాభం మేఘం లేనప్పుడు 
భాషయుండి ఏం లాభం భావం లేనప్పుడు
గాత్రముండి ఏం లాభం స్వరములు లేనప్పుడు

పరుగులెట్టి ఏం లాభము గమ్యం లేనప్పుడు
బలముండి ఏం లాభం ధైర్యం లేనప్పుడు
గెలుపొందీ ఏం లాభం పోటీ లేనప్పుడు   
కష్టించి ఏం లాభం సంతోషం లేనప్పుడు  #telugu #telugupoem #kavita  #teluguvelugu #yqkavi 

#Amaterasutelugu

amaterasu

వెలుతురికై వెతుకులాట చీకటిలో చేస్తావా?
నీ ఆశయమేమిటంటూ పరులనడిగి చూస్తావా?
పక్షిలాగ ఎగరాలని ఏనుగు కృషిచేస్తుందా?
పరుల ఆశయాలతో నీ మది సంతోషిస్తుందా?
(పరుల) బానిసవై బతుకుతావ? సంకెళ్ళను తెంచుకోవా?

ఒక్కడైనా తోడులేడని నీ దారిని వదిలేస్తావా?
లక్షమంది వెల్తుంటే లక్ష్యాన్నే మార్చేస్తావా?
కోటి మంది కలిసి చెప్తే అబద్దం రుచిస్తుందా?
ఏవొక్కడు పలుకకున్నా నిజం నిలువకుంటుందా?
(భయానికి) బానిసవై బతుకుతావ? సంకెళ్ళను తెంచుకోవా?

దేనికోసమింత పరుగని ఒక్కసారి మనసునడుగు
దాగి ఉన్న కలలెన్నో! మరిచిపోయినవికెన్నో?!
కలలనన్ని కరుగబెట్టి సాగరాన్ని చేస్తావా? ఆ సంద్రంలో చస్తావా?
(కాలపు) బానిసవై బతుకుతావ? సంకెళ్ళను తెంచుకోవా?  #telugu #telugupoem #kavita #teluguvelugu #yqkavi

#Amaterasutelugu

amaterasu

మౌనం చెప్పే ఊసులు ఎన్నో
వినివొచ్చావా మది లోగిళ్ళో..
నిదురకు తెలియని కలలెన్నెన్నో
కలిసొచ్చావా చిరు ఆశలలో..
సంద్రం ఎరుగని అలజడులెన్నొ
గమనించావా ఎద లోతులలో..
గమ్యం చూపే దూరాలెన్నో
గాలించావా విజయపు వొడిలో..
గాయం చెప్పే కబురులు ఎన్నో
గుర్తించావా గుణపాఠాలను...
కాలం ఎరుగని క్షణములు ఎన్నో
గడిపొచ్చావ చిరు ప్రాయంలో..
భాషకు అందని భావాలెన్నో
పొందొచ్చావా ఆప్తుల ప్రేమలో..
చీకటి ఒలికే అందాలెన్నో
చూసొచ్చావా సిరివెన్నెలలో.. #telugu #kavita #telugupoetry #teluguvelugu #yqkavi 

#Amaterasutelugu

amaterasu

ఆకాశం ఉరుముతు ఉంటే మేఘాలేమో అనుకున్న
ఆనందం ఎల్లలు దాటి బయటకు వచ్చి కూర్చున్న
ఆలోచనలెన్నో కలసి నామది తలుపులు తడుతున్నా
ఆమేఘపుటంచునుదాటి జారే చినుకుకై చూస్తున్నా

చూపులతో నిలిచెను కాలం,
తలపులతో నిండెను మౌనం,
కనులెదుట మిగిలెను శూన్యం,
మనసెళ్ళెను ఎటో పయనం.

చిరుగాలి చెప్పిన ఊసులు,
సిరిమల్లెలై పూసిన నవ్వులు,
ఆవెచ్చటి సూర్యుని కాంతులు,
మంచు ముత్యాలను మోసెను ఆకులు.

అలలన్నీ పోటీ పడుతూ
తీరంలో కేరింతలుకొట్టగా,
అది చూస్తూ అచ్చలపతులన్నీ
అచ్చోటనే కూర్చునిపోగా,
ఇకలెమ్మని కెరటాలెన్నో
ఆ కొండలను తడుపుతూ పోయెను.

నా కలలకు కళ్ళెం వేస్తూ,
నా తలపుల తలుపులు మూస్తూ,
జడి వాన తడిపేనమ్మ,
ఇక రమ్మని పిలిచే అమ్మ.

ఆకాశం ఉరుముతు ఉంటే మేఘాలేమో అనుకున్న
ఆనందం ఎల్లలు దాటి బయటకు వచ్చి కూర్చున్న
ఆలోచనలెన్నో కలసి నామది తలుపులు తడుతున్నా
ఆమేఘపుటంచునుదాటి జారే చినుకుకై చూస్తున్నా
 #telugu #telugupoem #kavita #teluguvelugu  #yqkavi

#Amaterasutelugu

Karthik Katkojwala

నీ దెగ్గర దైర్యం లేనపుడు
నా దెగ్గర నమ్మకం ఉండి ఏంలాభం #telugu #thoughts #collab #kavita #telugukavi #prema

amaterasu

కనుల ఎదుట నీ రూపం చెదరగ,
కనుల లోపలొక సంద్రం కదలగ,
కనుల రెప్పలను కట్టను కోయగా,
కనుల సాక్షిగా కదిలిన కాలపు
కడలి సవ్వడై నా చెవిన చేరగా,
వినిపించిన నీ రాగం మడుగున 
కనిపించే నీ హృదయము చూస్తూ 
చెదిరిన నీ రూపం మరచి
స్మ్రుతి కొచిన్న నీ గ్నప్తుల తలువగా
సంద్రపు ఉధ్ధతి ఎక్కువ కాగ, 
రెప్పలు తెరచి లోకము చూడగ,
భాష్పము రాలగ చెక్కిలి మీదుగా
ఆనందము పొంగెను నా యదలోనా #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi 


#Amaterasutelugu

amaterasu

ఆలోచనలవధులుదాటి ఆనందాల దరి చేరగ
ఆ మేఘపుటంచున దాగిన చిరు నవ్వుల సిరివెన్నెలవా..
నీ వెలుగుల సొగసులు తాకగ వికసించిన కమలము నేనే..
జన్మించిన నిమిషము నుండి నీజాడకై చూస్తున్నానే...

ఊపిరి పోసి ఎటుపోయావే
ఊసులు కూడ వినపడవాయే
ఊహలకందని జగమో ఏమొ
నిజమో కలయో తెలియని మాయో #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi 

#Amaterasutelugu

amaterasu

ఉట్టి నుండి ఊరగాయ  గట్టు మీద  దింపి పెట్టి
ఎర్రాని ఆవకాయ అరచేతితొ తీసిబట్టి
చల్ల కుండ -- చల్లగుండ చల్దన్నం గిన్నెనెట్టి
ఉప్పేసి వామేసి అరచేతడు నూనేసి
రసాలూరు మామిడిని ఎడమచేతను పట్టి
కలిపేసిక తింటుంటే -- అమృతము తూగుతుందా?
కలిపి అమ్మ పెడుతుంటే -- ఆ కమ్మదనం దొరుకుతుందా?  #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi

#Amaterasutelugu
loader
Home
Explore
Events
Notification
Profile