Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

Suryasamudra Sasura

నా మార్గాలను వికసింపజేసే దీవెన #వర్షం #నువ్వు మహిమాన్వితమైన పూర్తి ప్రవేశ ద్వారం మన sప్రేమ పువ్వులు మరియు #సీతాకోకచిలుకలు మరియు #అందమైన ధ్వని నా #హృదయంలో సముద్రం #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

#వర్షం #ఉరుములు #Telugu #teluguvelugu

read more
ఉరుముతుంది ఆకసం
ఎన్ని నెలల ఉక్రోశమో! 
కార్చుతుంది గుండె దుఃఖం
ఎన్నేళ్ళ మధనమో!

చెవులు మూసుకుందురే నరులు
ఎవరినో తలుస్తూ...
ఏమైందని నిన్ను అడగ వచ్చేదెవరే! 
నీ అరుపులెనక కారణం వినవచ్చేదెవరే! 

నీది హర్షమనుకోనా...
లేక వేదననుకోనా...

ఏమో ఏదైనా...

చెప్పుకో ఈ రాతిరమ్మకైనా...
దాచుకో ఓ చినుకు చెమ్మ నీకైనా... #వర్షం #ఉరుములు #telugu #teluguvelugu

srilatha lion

🤭😁...🌧️🌧️🤷 #గజల్ #వర్షం #ఎట్టాగే #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
చినుకు చినుకు నిన్ను తాకి తడుపుతుంటె ఎట్టాగే!
చీర తడిసి మధువలపు ఒలుకుతుంటె ఎట్టాగే!

జడిసి నువు హత్తుకోగ ఉరుములకే ఉలుకొచ్చెనె
అరుపు మాది చెలి నీదని నసుగుతుంటె ఎట్టాగే!

కౌగిలిలో వణుకుతున్న కిన్నెరసలె కందిపోద 
కవ్వమోలె తెమ్మెరొచ్చి చిలుకుతుంటె ఎట్టాగే!

శృతిమించక బుద్ధిగ నే ఉంటానని భీష్మిస్తే 
చిలుక పలుకు నువ్వలాగ పలుకుతుంటె ఎట్టాగే!

చీర మహిమొ చినదానీ మహిమొ గాని చిచ్చురేపి 
చినపాపల నడిమంతర అలుగుతుంటె ఎట్టాగే!  🤭😁...🌧️🌧️🤷

#గజల్ #వర్షం #ఎట్టాగే #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

ఆకాశం అత్త 🤭 #yqbaba #yqkavi #హైకూలు #వర్షం #Telugu #teluguvelugu

read more
వర్షం చుట్టాన్ని
చూడగనె చుట్టేసే 
చుక్కల చాప  ఆకాశం అత్త 🤭 

#yqbaba #yqkavi #హైకూలు #వర్షం #telugu #teluguvelugu

srilatha lion

బయట వర్షం ఈ పిక్ లో వర్షం సో నేనూ ఓ రాయేసా నా కవితలో వర్షం కురిపించ.. 😃 #వర్షం #చిత్రంచెప్పినకవిత #సరసం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugupoetry

read more
చిరు చినుకుల్లో చిద్విలాసం
చిలకగ చినదాని చెన్ను సిగ్గుపడే సరసం
విచ్చుకున్న ఆ విరిని జూడగ 
నా మదాయే పాదరసం 
చాలనిపించెలే ఈ జన్మకి తనతో 
ఈ క్షణకాల సావాసం
చెయ్యాలనిపించెలే తనకై తానూహించని ఓ సాహసం బయట వర్షం ఈ పిక్ లో వర్షం 
సో నేనూ ఓ రాయేసా నా కవితలో వర్షం కురిపించ.. 😃

#వర్షం #చిత్రంచెప్పినకవిత #సరసం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugupoetry

srilatha lion

#వర్షం #నేను #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
దేవుడా అనిపించేంత దట్టమైన భారీ వర్షం 
కనులెన్నడు కనని కారుచీకటి 
టార్చ్ పడుతున్నట్టుగా గర్జిస్తున్న
ఉరుములు,మెరుపులు 
గుండెల్లోనే పడుతుందేమో అనేంతగా
గుండె జబ్బున్నోడు హరీమనేంతగ 
హుఠాహుఠిన నేలకొరుగుతున్న పిడుగుల శబ్ధం 
హుమ్ సమయం చూస్కుని అంతా బదులుకుని బయటికి బయలెళ్ళారేమో అన్నట్టుగా ఇంట్లో ఎవరూ లేరు 
ఐనా ఎందుకో భయం నను తాకడానికి జంకుతుంది
బహుశా నాలోని చీకటి ముందు 
నా చుట్టూ కమ్మిన ఈ కారుచీకటి ఎంతపాటిది అనేమో!
నా గుండెల్లో పడే పిడుగుల ధాటికి 
ఈ పిడుగుల శబ్ధం ఎంతపాటిది అనేమో!
ఇక ఒంటరితనమంటావా?
హ హ కొత్తేమి కాదుగా... #వర్షం #నేను #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

srilatha lion

#కన్నీరు #వర్షం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

read more
ఆ మాత్రం జాగ్రత్త పాటించననా?
మరీ అంత సంశయమేంటి నీకు!
ఎక్కడ మూడోకంట పడతానోనని
భయంతో కూడిన ఆత్రంతో 
ఓ పరిగెత్తుకొచ్చావేం వరుణుడా! 
నా కన్నీటిని నీ చినుకుల్లో కలుపుకొన.
నాకన్న నీకే ఎందుకంత తొందర
నీకోసం నే ఎదురుచూడాలే గాని 
నాకోసం నువు పరుగున రావడం నాకెందుకో 
ఆత్మీయ ఆలింగనమనిపించింది
నీ అరుపులు నాకేదో జాగ్రత్త చెబుతున్నట్టు 
నీ స్పర్శ నా వెన్ను తడుతున్నట్టుంది
నువ్వైనా నాకోసం కరిగి కదిలొచ్చావ్
ఐనా సంతోషంగా ఉంది 
మనస్ఫూర్తిగా ఏడ్చే అవకాశం 
నువ్వే ఇవ్వగలవ్ మరి. #కన్నీరు #వర్షం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

srilatha lion

#వర్షం #అందం

read more
వేళ కాని వేళ ఈ వర్షమేల
ఎంత మధురము ఈ క్షణం 
చల్లని సమీరం చిలిపిగా తాకుతుంటే
అక్కడక్కడ నలుపు రంగద్దుకున్న అందమైన చీర కట్టుకున్న ఆకసాన్ని మేడ మీద నిలబడి చూస్తుంటే ఎంత హాయిగా ఉందో 
నిజంగా ఇంతందమైనదా ప్రపంచం రోజు రోజుకు మరీ ఇంతందంగా ముస్తాబవుతుంది నాలో పులకింత పుట్టించడానికేనేమో బహుశా
పలకరించే పచ్చని చెట్లు చూస్తుంటే దారి పొడుగునా ఎంత దూరమైనా అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏంటో తన గమ్మత్తు 
ఇలా ప్రతీరోజు ఉంటే నయనానందకరమేగ జీవితమంత
ఇలా ఈ క్షణం ఆగిపోతే ఎంతబాగుండో అనిపిస్తూనే ఒక్కోసారి వద్దనిపిస్తుంది నువ్ లేవుగా నాతో 
అదొకటే వెలితి నువ్ కూడా ఉండుంటే నాకన్న అదృష్టవంతురాలుండదేమో
 #వర్షం #అందం

srilatha lion

షిట్!! షిట్!! ఒసెయ్ వర్షం ఎంత పని చేసావే? 😡 నువ్ మబ్బు దుప్పటి కప్పిన క్షణమే నీ రాకను ఊహించి ఎంచక్కా నువ్ కురిసేప్పుడు తనతో మంచి డ్యుయెట్ ఏస్కుందామని బయల్దేరా. నీతో కూడా చెప్పా కదే కాసేపు ఆగమని అంత తొందరేంటే నీకు ఛ! ఇక్కడ మధ్యలోనే ఆగిపోవాల్సొచ్చింది చూడు 😔 #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #sltelugu #చిత్రంచెప్పనకవిత

read more
😔😏😏😏 👇 షిట్!! 
షిట్!!
ఒసెయ్ వర్షం ఎంత పని చేసావే? 😡
నువ్ మబ్బు దుప్పటి కప్పిన క్షణమే నీ రాకను ఊహించి 
ఎంచక్కా నువ్ కురిసేప్పుడు తనతో మంచి డ్యుయెట్ ఏస్కుందామని బయల్దేరా.
నీతో కూడా చెప్పా కదే కాసేపు ఆగమని
అంత తొందరేంటే నీకు
ఛ! ఇక్కడ మధ్యలోనే ఆగిపోవాల్సొచ్చింది చూడు 😔

srilatha lion

తను వచ్చి నిలబడి౦దలా నా ప్రక్కన ఇక నాలో తు౦టరి తలపులు నర్తిస్తున్నా ఆ తపన తాలుకా హావభావాలను కట్టిపెట్టి తనని అడిగి అడగలేక అడిగేసా ఒక్కసారి ఈ వర్షపు జల్లుల్లో తనతో నాట్యమాడాలను౦దని.. తను మొదట తడబడి౦ది ఆమె అధర౦ వణుకుతున్నా కీరమ౦టి పలుకులతో సరేయ౦ది ఇక అవధనే పదానికి అర్దాన్ని మరిచి ఆమెతో అల్లుకుపోయా... అనిమిషులే అహో అనే౦త అతివ మరి ఆమె ము౦దు నేనె౦త వర్షమె౦త అని గర్వ౦తో నా అదృష్టాన్ని అనుభవి౦చా.. ఇ౦తలో ఆ అ౦దాలభరిణతో నా అల్లికకు వర్ష౦ అసూయపడి ఆగిపోయి౦ది.. హుమ్ తను వెళ్ళిపోయి౦ది... నేనిక వర్షాన్ని బ #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #వర్షం #నాఛాలెంజ్

read more
దివా౦తమున మేఘ౦ మిల మిల మెరిసే ఆ సౌదమున నే కా౦చితిలే అతి లావణ్యమైన లతా౦గిని.. 
అప్పటివరకు రానని అలకలో మిన్ను శయ్యన వగలుబోతూ  ఉన్న వర్ష౦ విల౦బనము సేయక ఉబికి వచ్చి౦ది మన్ను కన్నా ము౦దు చారువదన చ౦ద్రికను అణువణువు తాకి తన పరువాన్ని తడప... 
నాక౦టే వర్షమే నయమనపి౦చి౦ది అనుకున్నదే తడవుగా తరలివచ్చి తనని తడిమి౦ది.. ఆ వర్షపు చినుకుల చు౦బన తాకిడికి తనకు గిలిగి౦త పుట్టి౦దేమో చిరుమ౦దహాస౦తో చిన్నది లతా౦తమ౦టి పాదాలతో నా వైపు పరిగెత్తుకు౦టూ వస్తు౦ది.. ఆ వర్షపు హోరులో నాలో తమకము మరి౦త పెరిగి౦ది....ఆ తరుణి అలా కదిలొస్తు౦టే తనని తాకి తెగ మురిసిపోతున్న మళయమారుత౦ ఒక్కసారిగా నన్ను సుకుమార౦గా స్పృశి౦చేసరికి వెచ్చబడి౦ది నా వెన్ను.. 
    Read in caption 👇 తను వచ్చి నిలబడి౦దలా నా ప్రక్కన 
ఇక నాలో తు౦టరి తలపులు నర్తిస్తున్నా ఆ తపన తాలుకా హావభావాలను కట్టిపెట్టి తనని అడిగి అడగలేక అడిగేసా ఒక్కసారి ఈ వర్షపు జల్లుల్లో తనతో నాట్యమాడాలను౦దని.. 
తను మొదట తడబడి౦ది ఆమె అధర౦ వణుకుతున్నా కీరమ౦టి పలుకులతో సరేయ౦ది ఇక అవధనే పదానికి అర్దాన్ని మరిచి ఆమెతో అల్లుకుపోయా... 
అనిమిషులే అహో అనే౦త అతివ మరి ఆమె ము౦దు నేనె౦త వర్షమె౦త అని గర్వ౦తో నా అదృష్టాన్ని అనుభవి౦చా.. ఇ౦తలో ఆ అ౦దాలభరిణతో 
నా అల్లికకు వర్ష౦ అసూయపడి ఆగిపోయి౦ది..
హుమ్ తను వెళ్ళిపోయి౦ది...
నేనిక వర్షాన్ని బ
loader
Home
Explore
Events
Notification
Profile