Find the Best స్వేచ్ఛ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°¸à±à°µà±‡à°šà±à°› నా సాంగà±à°¸à±, à°¸à±à°µà±‡à°šà±à°› అంటే à°à°®à°¿à°Ÿà°¿, à°¸à±à°µà±‡à°šà±à°› à°…à°°à±à°¥à°‚, à°¸à±à°µà±‡à°šà±à°› కోలà±à°ªà±‹à°¯à°¿à°¨ వాడà±, à°¸à±à°µà±‡à°šà±à°› à°µà±à°¯à°¤à°¿à°°à±‡à°• పదం,
srilatha lion
వినీలాకాశం నీదే ఎగిరే పక్షి నీవైతే... 👇 నేలమీద పాదాలు! చూపులు ఆకాశం అంచులు!! ఎగరాలనుందొకసారి... ఈ రెండు కళ్ళు తాళలేకున్నవి ప్రపంచానికున్న అందాన్ని చూసి... ఆ అందాన్నంత చూపించాలనుంది
srilatha lion
కొన్నిటిలో గోప్యతే శ్రేయస్కరం స్వేచ్ఛాపూరితం పైగా ఆరోగ్యకరం #గోప్యత #స్వేచ్ఛ #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi
srilatha lion
ప్రతీసారి పరుల ప్రతిస్పందనను బట్టి నీ స్పందనకు మెరుగులద్దకు అలా చేసినన్నాళ్ళు నీ స్పందన స్వేచ్ఛ నువ్వే హరింపజేసినట్టు స్పందించు స్వేచ్ఛగా మదిగోడల నడుమ బంధీని విడుదల చేసేలా #స్పందన #స్వేచ్ఛ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
srilatha lion
స్వేఛ్ఛ ప౦జర౦లో చిలకకే కాదు మీ కనుము౦దర మెదిలే అతివలకి కూడా అవసరమే మిమ్మల్ని పున్నామ నరక౦ ను౦డి కాపాడే పుత్రుడికే కాదు పుడమ౦టి ఓర్పు కలిగి ఎవ్వరు కాదన్న అఖరుకు నేన౦టూ మీకున్నాననే మీ బ౦గారు పుత్రికలకి కూడా అత్యవసరమే జనియి౦చిన ఒక్క జన్మలో ప్రతిదా౦ట్లో అడ్డుకట్ట లా౦టి ఆనకట్ట నిర్మి౦చడ౦ కాదు ధైర్యంగా తమని తాము తలమానికంగా నిలుపుకునే౦త ప్రోత్సాహంతో కూడిన స్వేచ్ఛనివ్వాలి మగాడు అన్న అహాన్ని వదిలి అ౦తా ఒకటే అనే భావన మొక్కగా ఉన్నపుడే కల్పి౦చాలి తమ సోదరీమణుల సమ్మతి మేరకు స్వతంత్రంగా మనసుకి నచ్చిన వారితో జీవితం ప్రేమగా గర్వ౦గా ప౦చుకొనే౦త అభిప్రాయానికి గౌరవమిచ్చే౦త స్వేఛ్ఛనివ్వాలి స్వేఛ్ఛ పద౦ వినడానికే రెక్కలొచ్చిన౦తా తేలికగా హాయిగా ఉ౦ది ఇక అ౦తటి స్వేఛ్ఛనిచ్చి చూడ౦డి ఆడపిల్లల అభివృద్ధి ఆపగలర౦టారా? ఆడపిల్లలే ఇ౦టికి మహాలక్ష్ములు వారిని స్వేఛ్ఛగా సంతోషంగా బ్రతకనీయ౦డి... #yqbaba #yqkavi #స్వేచ్ఛ #telugu #sltelugu #teluguvelugu #lovequotesbysrilathalion
Narahari Rao
🎉🎉🎉 నరహరి నిత్య నిపఠము 🎉🎉🎉 3⃣4⃣0⃣ ఆనాటి ఎందరో వీరుల త్యాగఫలితంగానే నేడు మనం స్వేచ్ఛావాయువులను మనసారా పీల్చగలుగుతున్నాం. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాం. మన మనస్సుల్లో ఎటువంటి నిర్బంధాలు లేకుండా సంకుచితత్వ భావాలకు తిలోదకాలిచ్చేసి అలరారే అనురాగాలతో అనన్యమైన దేశభక్తితో సంపాదించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఎప్పటికీ అలానే నిలుపుకుందాం. సంస్కారయుత విలువలతో కూడుకొని విలసిల్లే నవ్య దివ్య భవ్య భారత్ ను నిర్మించుకుందాం. 💐💐💐75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐 15- 08- 2022 ✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము #తెలుగుకవి #తెలుగు #స్వాతంత్ర్యదినోత్సవం #స్వేచ్ఛ #yqtelugu #yqteluguquotes #teluguquotes #telugu
Naresh Reddy Aleti
చట్టములు రాసుంచిన దేశానికి మనమొచ్చాం నియమావళి చేసుంచిన గ్రామానికి మనమొచ్చాం తప్పదులే తలొగ్గాలి, స్వేచ్ఛెప్పుడు ప్రశ్నేలే.. సంస్కృతులను మార్చలేని నిలయానికి మనమొచ్చాం #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయిలు #దేశం #గ్రామం #ఇల్లు #స్వేచ్ఛ మార్పు అసాధ్యమైన చోట అవగాహనే అవశ్యం
Naresh Reddy Aleti
చెట్టు పైన పిట్టలనే వాలుతుంటె చూడాలి చెరువు గట్లు పిల్లలనే దుముకుతుంటె చూడాలి ఎల్లలంటు లేనెలేవు స్వేచ్చెంతో నేర్పించే.. విను వీధిలో మువ్వన్నెలు ఎగురుతుంటె చూడాలి #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #స్వేచ్ఛ #మువ్వన్నెలపతాకమా Pic source: mr..kk @Mr..kk
Naresh Reddy Aleti
ఉన్నట్టే ఉందేమో స్వేచ్ఛ లేకుండా ఉంది ఎగురుతూనే ఉందేమో ఎల్లలు దాటలేకుంది గగనతలంలో పతంగి భూతలంలో లతాంగి #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #స్వేచ్ఛ #గాలిపటం గాలిపటాన్ని ఆకాశంలో ఎగరేసి చేతిలో దారం ఉంచుకుని ఆడిస్తుంటాం. స్త్రీ కి స్వేచ్ఛ ఇచ్చామంటునే తన చేతిలోనే ఉంచుకుంది పురుష ప్రపంచం. స్వేచ్ఛ ఇవ్వాలి.
Phanindra Ganesh
తెగిన గాలిపటంలా మన బంధం స్వేచ్ఛగా ఎగిరిపోయింది, వెతికి కనిపెట్టగలను, కనిపెట్టి మరల తాడు కట్టి ఎగురవేయగలను, కానీ, బంధాన్ని బందీ చేసి ఆ బరువును ఎగురవేయడం పక్కన పెడితే అస్సలు మోయగలనా? Our bond is like a beautiful kite with broken thread, it flew n flew freely with its own freedom. I feel and I am sure that, I can search for it and can find it too, after that, I can re-tie it and make it fly. But what I also feel is, forget about flying, can I even make it to hold that caged bond which accumulated all the weight. #kite #brokenlines #yqkavi #telugu #గాలిపటం #స్వేచ్ఛ #ganshots #yqbaba
Phanindra Ganesh
ఎగరేయబడిందో, వెలివేయబడిందో, ఓ తెగిన గాలిపటంలా, స్వేచ్ఛగా, పిచ్చోడి చేతిలో రాయిలా, వేగంగా, గమ్యం లేదు, దిశా నిర్ధేశాలు అంతకంటే లేవు, ఆ స్వేచ్ఛ కూడా చాలా భారంగా అనిపించేలా, పయణమయ్యింది ఆ పగటి తామసిలో. #freedom #love #lovefailure #yqkavi #yqbaba #స్వేచ్ఛ #ప్రేమ #ganshots